ఈ సినిమాలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా లో తన నటనతో ఆకట్టుకుంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా అంచనాలను మించి సక్సెస్ సాధిస్తూ, బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి, టాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. ఈ మధ్య కాలంలో బిగ్ స్టార్ హీరోల సినిమాలు 100 కోట్లు కలెక్ట్ చేయడం పెద్ద గగనంగా మారిపోయింది. ఇలా మొదటి సినిమాతోనే 100 కోట్ల మార్క్‌ను దాటిన దర్శకుడు కీర్తి శ్వరన్ ఒక సెన్సేషనల్ రికార్డును నెలకొల్పారు. ఇదే ఘనతను గతంలో ‘ఉప్పెన’ సినిమా ద్వారా దర్శకుడు బుచ్చిబాబు సనా సాధించారు. ఆయన లాగా, కీర్తి శ్వరన్ కూడా తన తొలి సినిమాతోనే అలాంటి మైలురాయిని చేరుకున్నారు.
ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంటున్న ఈ సినిమా, కీర్తిశ్వరన్ కి ఇండస్ట్రీలో మంచి స్థానం తీసుకొచ్చింది. ప్రదీప్ రంగనాథన్ పెర్ఫార్మెన్స్, కామెడీ టైమింగ్, మరియు ఎమోషనల్ డెప్త్‌కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఆయనకు తెలుగు ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన ఫాలోయింగ్ పెరుగుతోంది. ఈ విజయంతో ఆయన తెలుగు డైరెక్టర్లతో కూడ వర్క్ చేయబోతున్నారని తెలుస్తుంది. త్వరలోనే ఒక పెద్ద తెలుగు ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ‘ఉప్పెన’ తర్వాత అలాంటి మ్యాజిక్ మళ్లీ చూడాలని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ‘డ్యూడ్’ ఆ తీపి అనుభూతిని అందించింది. ప్రేమ, హాస్యం, ఎమోషన్ అన్నీ కలగలిసిన ఈ సినిమా నిజంగా బాక్స్ ఆఫిస్ వద్ద ఓ నూతన ఉప్పెనలా దూసుకుపోతోంది!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి