- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక సీక్వెల్ సినిమా అఖండ 2 - తాండవం. ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాక పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు రేపుతోంది. 2021లో విడుదలైన అఖండ సినిమా కలెక్షన్ల పరంగా, అలాగే బాలయ్య మాస్ ఇమేజ్ పరంగా సంచలనం సృష్టించింది. ఆ విజయాన్ని మించి అఖండ 2 ని రూపొందించేందుకు బోయపాటి శ్రీను భారీ స్కేల్లో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. విశ్వ‌స‌నీయ వర్గాల ప్రకారం, ఈ సినిమా లో బాలయ్య లుక్ , స్క్రీన్ ప్రెజెన్స్ మునుపటి దానికంటే మరింత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందట. ఆల్రెడీ షూటింగ్ దాదాపు పూర్తి దశలో ఉండగా , పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి.


ముఖ్యంగా, ఈ సినిమా ట్రైలర్ పై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. బోయపాటి అండ్ టీం పాన్ ఇండియా లెవెల్లో హైలెవెల్ ప్రమోషన్ కోసం ఒక సెన్సేషనల్ ట్రైలర్ కట్ సిద్ధం చేస్తున్నారని తెలిసింది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ఈ ట్రైలర్ లో బాలయ్య డైలాగ్స్ , బోయపాటి యాక్షన్ డిజైన్ , తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మూడు కలిసి గడ్డకట్టే స్థాయి ఎనర్జీని అందిస్తాయట. ట్రైలర్ రిలీజ్ కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ మార్కెట్లలో కూడా ఒకేసారి విడుదల చేసే ఆలోచనలో టీం ఉందని తెలుస్తుంది.


ఇక ఫ్యాన్స్ వైపు చూస్తే, “ బాలయ్య తాండవం మళ్లీ మొదలవ్వబోతోంది ” అంటూ సోషల్ మీడియాలో హాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. బోయపాటి - బాలయ్య కాంబినేషన్‌పై ప్రేక్షకుల నమ్మకం మళ్లీ రుజువు కావడానికి ఈ సినిమా కీలకం అవుతుంది. మొత్తానికి, అఖండ 2 - తాండవం ట్రైలర్ విడుదలతోనే పాన్ ఇండియా ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించి, సినిమా హైప్‌ను మరో లెవెల్‌కి తీసుకెళ్లబోతోందని సినీ వర్గాల అంచనా.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: