సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది లవ్ బర్డ్స్ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సెలబ్రిటీ లవ్ బర్డ్స్ లో విజయ్ రష్మిక మందన్నాలు కూడా ఒకరు..వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని ఎప్పటినుండో వినిపిస్తున్న మాట. అయితే వీరిద్దరూ తమ మధ్య ప్రేమ ఉంది అనే విషయాన్ని ఎప్పుడు అభిమానులకి సస్పెన్స్ గానే పెట్టారు. కానీ ఎప్పుడు వీరిద్దరూ కలిసి తిరుగుతూ అభిమానులకు కొత్త కొత్త డౌట్లు పుట్టించినప్పటికీ ఇప్పటివరకైతే అధికారికంగా ప్రకటించలేదు. అయితే రీసెంట్ గానే ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపించాయి. అలా అక్టోబర్ 3 న విజయ్ దేవరకొండ ఇంట్లో చాలా తక్కువ మంది సన్నిహితుల మధ్యలో విజయ్ దేవరకొండ రష్మిక మందన్నాల నిశ్చితార్ధ వేడుకలు జరిగాయట. ఇక ఈ నిశ్చితార్థం జరిగిన వెంటనే వీరిద్దరూ చేతివేళ్ళకు ఉంగరాలతో దర్శనమిచ్చేసరికి చాలామంది ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు మాట్లాడుకున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండ రష్మిక మందన్నాల పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిందని, ఆ ప్లేస్ లోనే వీరి పెళ్లి జరగబోతుంది అంటూ మాట్లాడుకుంటున్నారు. మరి ఇంతకీ రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండల పెళ్లి ముహూర్తం ఎప్పుడు.. ఏ ప్లేస్ లో వీరి పెళ్లి జరగబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇక విజయ్ దేవరకొండ రష్మిక మందన్నాల పెళ్లి వచ్చేయడాది ఫిబ్రవరిలో జరగబోతుందట.అలాగే వీరి పెళ్లి వేడుక ఉదయ్ పూర్ ప్యాలెస్ లో ఘనంగా జరగబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో ఓ టాక్ వినిపిస్తోంది.అంతే కాదు సోషల్ మీడియాలో వీరి పెళ్లి వార్తలు జోరుగా చక్కర్లు కొట్టడంతో పాటు ఫిబ్రవరి 26న వీరి పెళ్లి ఉదయ్ పూర్ ప్యాలెస్ లో గ్రాండ్ గా కుటుంబ సభ్యులు,సన్నిహితులు, సినీ సెలెబ్రిటీల మధ్యలో జరగబోతుంది అంటూ ఒక పోస్ట్ వైరల్ అవుతుంది.

దాంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. మరి నిజంగానే విజయ్ దేవరకొండ రష్మిక మందన్నాల పెళ్లి వేదిక ఉదయ్ పూర్  ప్యాలెస్ కాబోతోందా.. ఉదయ్ పూర్ ప్యాలెస్ లోనే దంపతులుగా ఒక్కటి కాబోతున్నారా అనేది చూడాలి. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ పై ఇప్పటివరకు రష్మిక విజయ్ లు స్పందించలేదు. స్పందిస్తారనే నమ్మకం కూడా లేదు. ఎందుకంటే ఎంగేజ్మెంట్ గురించి ఇప్పటివరకు స్పందించలేదు. అలాంటిది పెళ్లి గురించి ఎలా స్పందిస్తారని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ అందరికీ తెలిసాక కూడా ఇంకా ఈ విషయాన్ని విజయ్ రష్మికలు ఎందుకు దాస్తున్నారో తెలియడం లేదు

మరింత సమాచారం తెలుసుకోండి: