ఐబొమ్మని నడిపించే ఇమ్మాడి రవి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న సంగతి మనకు తెలిసిందే.. దమ్ముంటే నన్ను పట్టుకోండి అని పోలీసులకు సవాల్ విసిరి మరీ దొరికిపోయాడు. అయితే అలాంటి ఇమ్మాడి రవి పోలీసులకు దొరికిపోవడంతో టాలీవుడ్ నిర్మాతలు అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇన్ని రోజులు వందల కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాలు తెరకెక్కించే నిర్మాతలకు ఐ బొమ్మ వల్ల వేల కోట్ల నష్టం వాటిల్లింది. అయితే తాజాగా ఇమ్మాడి రవి గురించి సంచలన విషయాలు బయటపెడుతూ సినీ ప్రముఖుల ఆధ్వర్యంలో సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో సినీ ఇండస్ట్రీ నుండి దిల్ రాజు,సురేష్ బాబు, చిరంజీవి, నాగార్జున,రాజమౌళి వంటి ప్రముఖులు వచ్చారు. ఇక ఈ ప్రెస్ మీట్ లో మొదట సౌదీలో జరిగిన బస్సు ప్రమాదం గురించి మాట్లాడి ఆ తర్వాత ఇమ్మాడి రవి గురించి సంచలన విషయాలు బయట పెట్టారు.

 ఇమ్మాడి రవి పై ఇప్పటికే 5 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నిర్మాతలకు వేల కోట్లు నష్టం మిగిల్చారు. అంతేకాదు ఈయన వల్ల ఎంతో మంది బెట్టింగ్ యాప్ లకు బలై ప్రాణాలు కోల్పోయారు. సినిమాలను పైరసీ చేసే ముసుగులోనే బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేసి భారీగా డబ్బులు దండుకున్నాడు. ఇమ్మాడి రవి తెలుగు,హిందీ సినిమాలకు సంబంధించి ఎన్నో పైరసీ చేసి వేలకోట్లు సంపాదించాడు. రవి ఇప్పటివరకు 20 కోట్లు మాత్రమే సంపాదించానని చెబుతున్నాడు. ఇప్పటికే ఆయన దగ్గర ఉన్న మూడు కోట్లు సీజ్ చేసాం.

 అంతేకాదు ఆయన సైట్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న 50 లక్షల మంది డాటా కూడా ఇమ్మాడి రవి దగ్గర ఉంది. ఒకవేళ ఆయన దొరకకపోతే కచ్చితంగా 50 లక్షల మంది సబ్స్క్రైబర్ల డాటాని మిస్ యూస్ చేసే అవకాశం ఉండేది. మీ డాటా డార్క్ వెబ్ వరకు చేరే అవకాశం ఉంది.అందుకే జాగ్రత్తగా ఉండండి. దీని వెనుక పెద్ద రాకెట్ నడుస్తోంది. ఇమ్మాడి రవి ఫ్రాన్స్, అమెరికా, థాయిలాండ్,దుబాయ్ వంటి ఎన్నో దేశాలు తిరుగుతూ నెదర్లాండ్, అమెరికాలో సర్వర్లు పెట్టాడు అంటూ సంచలన విషయాలు బయట పెట్టారు సిపి సజ్జనార్.

మరింత సమాచారం తెలుసుకోండి: