ఈయన ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు. మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగిన ఈయన ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఫేడౌట్ అయ్యారు.ఇక ఆయన ఎవరంటే దర్శకుడు బి గోపాల్.. ఈయన పేరు చెప్పగానే ఇంద్ర, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలే గుర్తుకు వస్తాయి. అలా బాలకృష్ణతో చేసిన నరసింహ నాయుడు, సమరసింహారెడ్డి రెండు సినిమాలు కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వడమే కాకుండా ఇండస్ట్రీ లో అతిపెద్ద మార్కెట్ ని క్రియేట్ చేశాయి. అలా బాలకృష్ణ సినిమాల వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ల లిస్టులోకి వెళ్లిన బి గోపాల్ తర్వాత చిరంజీవితో ఇంద్ర సినిమా చేసి మరో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. 

అలా వరుస సినిమాలతో హిట్స్ అవ్వడంతో బి.గోపాల్ కెరియర్ ఎక్కడికో వెళ్లిపోయింది. .కానీ ఆ మధ్యలో బాలకృష్ణ తో చేసిన పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా దెబ్బ కొట్టింది. ఈ సినిమాతో బి గోపాల్ కెరియర్ పతనం అయింది.ఈ సినిమాల్లో కొన్ని సీన్స్ ఓవర్ గా ఉన్నాయని సినిమా చూసిన చాలామంది విమర్శలు చేయడంతో చివరికి ఈయనకు అవకాశాలు ఇవ్వడానికి ఏ ఒక్క హీరో కూడా ముందుకు రాలేదు. 

దాంతో పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా తర్వాత రెండు మూడు సినిమాలు చేసినప్పటికీ అవి అంతగా హిట్ అవ్వకపోవడంతో చివరికి ఈ డైరెక్టర్ ఫేడౌట్ అయిపోయారు.అలా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి ఇండస్ట్రీ హిట్ సినిమాలను అందించిన బి.గోపాల్ ప్రస్తుతం ఇండస్ట్రీలో కనుమరుగైన సంగతి మనకు తెలిసిందే. అలా బాలకృష్ణ సినిమాలతో స్టార్ అయి మళ్ళీ ఆయన సినిమాతోనే కెరియర్ పోగొట్టుకున్నారు.ఇక బి.గోపాల్ దర్శకత్వంలో బొబ్బిలి రాజా, కలెక్టర్ గారి అబ్బాయి,కలెక్టర్ గారు, అసెంబ్లీ రౌడీ,లారీ డ్రైవర్ వంటి హిట్ సినిమాలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: