టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ యేడాది ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇచ్చేశాడు. ముందుగా హరిహర వీరమల్లు సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వీరమల్లు సినిమా అంచనాలు అందుకోలేదు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ పీరియాడికల్ సినిమా పై ముందు నుంచి పలు సార్లు సినిమా రిలీజ్ వాయిదా పడడంతో పెద్దగా అంచనాలు లేవు. ఇక సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులకే కాదు పవన్ వీరాభిమాను లకు సైతం నచ్చలేదు. ఆ తర్వాత తక్కువ గ్యాప్ లోనే సుజిత్ డైరెక్షన్ లో వచ్చిన ఓజీ సినిమా అయితే మాంచి కిక్ ఇచ్చేసింది. ఇక ఇప్పుడు మరోసారి తక్కువ టైంలోనే పవన్ మరో సినిమా తో తన ఫ్యాన్స్ ను పలకరించనున్నాడు. అదే ఉస్తాద్ భగత్‌సింగ్.
పవన్ కళ్యాణ్ హీరోగా రాశిఖన్నా అలాగే శ్రీలీల హీరోయిన్లు గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కోసమే ఓ రేంజ్ లో టాలీవుడ్ వర్గాల్లో రచ్చ నడుస్తోంది. ఉస్తాద్ సినిమా ను ఫస్ట్ మేకర్స్ ఏప్రిల్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు స్వయంగా తెలిపారు. కానీ సడన్ గా సోషల్ మీడియాలో మార్చ్ నెల డేట్స్ ఊపందుకున్నాయి. ఇలా మార్చ్ 19 లేదా 26 డేట్స్ లో ఉస్తాద్ వస్తాడు అంటూ ఒక్కటే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. 26న ది ప్యారడైజ్ సినిమా కూడా ఉంది. రెండు ఒకేసారి వస్తే టాలీవుడ్ లో అది బిగ్ క్లాష్ అవుతుంది అనడంలో సందేహం లేదు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి