మరో రెండు వారాల్లో విడుదల కాబోతుంది ప్రభాస్, శ్రధ్ధాకపూర్ జంటగా నటిస్తున్న సాహో సినిమా. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది సాహో సినిమా. సినిమా బడ్జెట్ కు తగినట్లే 400 కోట్ల రుపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది సాహో . బాహుబలి, బాహుబలి2లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాల తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాకు ప్రభాస్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనే ఆసక్తి ప్రేక్షకుల్లో కూడా ఉంది. 
 
సాహో సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రభాస్ సొంత బ్యానర్ లాంటిది. సాహో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లో సగం ప్రభాస్ రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నాడని, 100 కోట్ల రుపాయలు ప్రభాస్ రెమ్యునరేషన్ అని ఇప్పటివరకు రకరకాల వార్తలు వచ్చాయి. కానీ తెలుస్తున్న సమాచారం మేరకు ప్రభాస్ బాహుబలి సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్లో 25 - 30% మాత్రమే సాహో సినిమాకు తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
సాహో సినిమాకు ప్రభాస్ ఇంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవటానికి ముఖ్య కారణం సాహో సినిమా బడ్జెట్. సాహో సినిమాను మొదట 150 నుండి 200 కోట్ల బడ్జెట్ తో నిర్మించాలని అనుకున్నారు నిర్మాతలు. కానీ సినిమాలో గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఎక్కువగా ఉండటం, భారీ ఖర్చుతో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించటంతో బడ్జెట్ మొదట అనుకున్నదానికంటే ఎక్కువయింది. దీనికి తోడు సినిమా నిర్మించింది తన స్నేహితులే కాబట్టి ప్రభాస్ తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నాడని సమాచారం. 
 
సాహో సినిమా విడుదలయ్యాక సినిమాకు భారీగా లాభాలు వస్తే మాత్రం ప్రభాస్ పూర్తి రెమ్యూనరేషన్ తీసుకుంటాడని తెలుస్తుంది. రేపు హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో సాహో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. సాహో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ శాటిలైట్, డిజిటల్ రైట్స్ 100 కోట్ల రుపాయలకు అమ్ముడయినట్లు సమాచారం. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: