అమెరికాలో దీపావళి వేడుకలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. టెక్సాస్ గవర్నర్ గ్రెగర్ అబాట్ శనివారమే భారత్ -అమెరికా ప్రతినిధులతో కలిసి పండుగ జరుపుకున్నారు. మరికొందరు ప్రజాప్రతినిధులు ట్విట్టర్ ద్వారా తమ వేడుకలను పంచుకున్నారు.


అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏటా దీపావళి జరుపుకుంటూనే ఉన్నారు. అయితే ఈఏడాదిడొనాల్డ్ ట్రంప్ మూడు రోజుల ముందే దీపావళిని జరుపుకోనున్నారు. వైట్ హౌజ్ లో గురువారం జరిగే దీపావళి వేడుకల్లో ట్రంప్ పాల్గొంటారు. 2009 నుంచి వైట్ హౌజ్ లో దీపావళి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.


ట్రంప్ వరుసగా మూడో ఏడాది ఈ పండుగ జరుపుకుంటున్నారు. దీపాలను వెలిగించడం ద్వారా వేడుకలను ట్రంప్ ప్రారంభిస్తారు. ఈ మేరకు వైట్ హౌజ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అమెరికన్ ప్రెసిడెంట్ దీపావళి జరుపుకోవడం ద్వారా భారతీయ పండుగకు అంతర్జాతీయ ప్రాచుర్యం లభిస్తోంది.


మరోవైపు అమెరికాలోని ఇండియన్లు దీపావళిని ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: