బ్రిటన్ ఆర్థిక మంత్రిగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఆర్. నారాయణమూర్తి అల్లుడు ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు బ్రిటన్ మీడియాలో విస్తృతంగా వార్తలు వస్తున్నాయి. భారత సంతతికి చెందిన రిషి సునక్ నారాయణమూర్తి కూతురుని వివాహం చేసుకున్నారు.

 

ఈయన మొన్నటి బ్రిటన్ ఎన్నికల్లో కన్వర్వేటివ్ పార్టీ తరపున గెలిచారు. రిచ్ మండ్ నుంచి పోటీ చేసి విజయఢంకా మోగించారు. ఈ రిషీ.. ప్రధాని బోరిస్ జాన్సన్ కు సన్నిహితుడుగా పేరుంది. అందుకే బోరిస్ రిషీని ఆర్థిక మంత్రి కావచ్చని చెబుతున్నారు. రిషీకి ఆర్థిక మంత్రిత్వ బాధ్యతలు కొత్త కాదు.. ఆయన గత ప్రభుత్వంలో ఉప ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

 

రిషి పని తీరు పట్ల బోరిస్ సంతృప్తిగా ఉన్నట్లు ప్రధాని సన్నిహితులు చెబుతున్నారు. కన్సర్వేటివ్ పార్టీ గెలుపులో కూడా రిషీ ప్రముఖ పాత్ర వహించారని అంటున్నారు. మొత్తానికి భారత దేశాన్ని ఒకనాడు ఏలిన బ్రిటీష్ ప్రభుత్వంలో  భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి కీలక మంత్రిత్వశాఖ చేపట్టబోవడం ఆసక్తిదాయకం, భారత్ కు గర్వకారణం.

మరింత సమాచారం తెలుసుకోండి: