బిత్తిరి సత్తి.. పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. తీన్మార్ వార్తల ద్వారా బాగా పాపులర్ అయిన ఈ నటుడు.. ఆ తర్వాత సినిమాల్లోనూ అడుగు పెట్టాడు. హీరోగా ఓ సినిమా కూడా చేశాడు. అటు టీవీ ఎంటర్ టైన్ మెంట్ రంగంలోనూ అనేక కార్యక్రమాల్లో ఉన్నాడు. మొత్తానికి బుల్లి తెర స్టార్ గా ఎదిగాడు. అలాంటి బిత్తిరి సత్తి ఇటీవలే టీవీ9లో చేరాడు. ఇస్మార్ట్ న్యూస్ అనే ప్రోగ్రామ్ ఇస్తున్నాడు.

 

 

అయితే.. రిజైన్ చేశాడో.. పంపించేశారో.. కానీ.. బిత్తిరి సత్తి మాత్రం టీవీ9 నుంచి బయటకొచ్చాడు. అయితే అసలు ఏం జరిగింది. ఏరి కోరి.. ఇష్టపడి మరీ.. టీవీ9 ఛానెల్ లో జాయిన్ అయితే.. ఇలా అర్ధాంతరంగా ఎందుకు బయటకు వచ్చాడన్నదానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. టీవీ9లో ఇస్మార్ట్ న్యూస్ ప్రారంభం కావడం.. ఆ తర్వాత వజ్యోతి అలియాస్ సావిత్రి ఆ ప్రోగ్రామ్ జత కలవడంతో.. మొదట్లో.. ప్రోగ్రామ్ పై అందరి కళ్లు పడ్డాయి.

 

 

వీ6 తీన్మార్ ప్రోగ్రామ్ కు కాపీగా వచ్చినప్పటికీ.. కంటెంట్ పరంగా ఇస్మార్ట్ న్యూస్ అంత సక్సస్ కాలేదు. సావిత్రి- సత్తి జోడీ మునుపటి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. బిత్తిరి సత్తితో డబుల్ రోల్ అంటూ పలు ప్రయోగాలు చేశారు. ఐతే.. అవి పెద్దగా వర్కవుట్ కాలేదు. విజయ్ దేవరకొండ స్లాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన సూర్య అనే కుర్రాడు ఇతని కంటే బాగా చేస్తున్నాడు. జనం సత్తి కన్నా.. దేవరకొండ స్టైల్లో సూర్య చేసే స్కిట్ ను చూసేందుకు ఆసక్తి చూపించారు.

 

లక్షలు పోసి తెచ్చుకున్న బిత్తిరి సత్తి తాము ఊహించినంతగా సక్సెస్ కాలేకపోయాడు. కానీ… పెద్దగా ఎక్స్ పెక్టేషన్స్ లేని సూర్య ప్రోగ్రామ్ కు హైప్ తెచ్చాడు. దీనికి తోడు ఛానెల్ లో చేస్తున్నా.. కమర్షియల్స్ చేసుకోవడం.. సొంత యూట్యూబ్ ఛానెల్ నడుపుకోవడం టీవీ9కు నచ్చలేదట. ఫాదర్స్ డే రోజు బిత్తిరి సత్తి చేసిన స్కిట్ మొత్తానికే ఎసరు పెట్టింది. స్కిట్ కోసం తన తండ్రి ఫొటోను బిత్తిరి సత్తి ఉపయోగించాడు. ఇలా ఎందుకు చేశారని మేనేజ్ మెంట్ అడిగింది. దానికి సత్తి చెప్పిన సమాధానంతో యాజమాన్యం శాటిస్ ఫై కాలేదు. అంతే వెళ్లిపొమ్మన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: