రోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయి.. తెలుగునాట జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారిన పేదలకు అండగా నిలబడేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన వంతు ప్రయత్నం చేస్తోంది. తాజాగా  గుంటూరు నగరంలోని 100 పేద కుటుంబాలను గుర్తించి బియ్యాన్ని పంపిణీ చేసింది. ఒక కుటుంబానికి నెలకు సరిపడే విధంగా బియ్యాన్ని న్యూజెర్సీ టీం అందించింది. రెండు టన్నుల బియ్యాన్ని నగరంలోని రెండు వార్డుల్లో పంపిణీ చేసింది. న్యూజెర్సీ నాట్స్ టీం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
IHG
 
నాట్స్ తరపున గుంటూరులోని నాట్స్ ప్రతినిధులు వెంకట్ వెంపరాల, సురేంద్ర చెన్నుపాటి, బలరాం పాటిబండ్ల బియ్యాన్ని పంపిణీ చేశారు. భవిష్యత్తులో 16 గ్రామాల్లో కూడా పేదలకు బియ్యం అందించేందుకు న్యూజెర్సీ నాట్స్ టీం ఏర్పాట్లు చేస్తోంది.   నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని మరియు నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి మాట్లాడుతూ నాట్స్ సంస్థ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అమెరికా లోనే కాక తెలుగు రాష్ట్రాలలో కూడా తెలుగు వారికి తన వంతు సాయం చేసేందుకు ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.
 
 
హ్యూస్టన్, టెక్సాస్‌ లో ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు నాట్స్ భోజనం :
 
అమెరికాలో కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్‌ను గౌరవించి వారిని ప్రోత్సాహించేందుకు నాట్స్ తన వంతు కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ హ్యూస్టన్ విభాగం ఫోర్ట్ బెండ్ కౌంటీ, న్యాయమూర్తి కే.పి.జార్జ్, టెక్సాస్ జడ్జ్ కార్యాలయం, అత్యవసర సిబ్బందికి భోజన ప్యాకెట్లు అందించింది. దాదాపు 100 మందికి పైగా భోజనాలు సిద్ధం చేసి ఆ ప్యాకెట్లను వారి కార్యాలయంలో అందించింది.
IHG
నాట్స్ బోర్డ్ డైరెక్టర్ సునీల్ పాలేరు, సౌత్ సెంట్రల్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ హేమంత్ కొల్ల, నాట్స్ హ్యూస్టన్ టీం చాప్టర్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ కాకుమాను, వీరూ కంకటాల, విజయ్ దొంతరాజు తదితరులు ఈ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.
IHG
కరోనాపై ముందుండి పోరాడే వారిని ప్రోత్సహించేందుకు నాట్స్ ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడాన్ని ఫోర్ట్ బెండ్ కౌంటీ జడ్జ్ కేపీ జార్జీ ప్రశంసించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: