ఇలాంటి సమయం లోనే అసలు ఉక్రెయిన్ విషయం లో రష్యా వ్యూహం ఏంటి అని అందరూ అనుకుంటున్న సమయం లో ఉక్రెయిన్ లో ఉన్న వేర్పాటు వాదులు ఏకంగా అక్కడి సైన్యం పై ఆయుదాల తో దాడులకు పాల్పడటం సంచలనం గా మారి పోయింది.. అయితే తమ సైన్యాన్ని ఉపసంహరించు కున్నాము అంటూ చెబుతున్న రష్యా డబుల్ గేం ఆడుతోందని.. ఏ క్షణంలో నైనా ఉక్రెయిన్ పై దాడి చేసే అవకాశం ఉందని అటు అమెరికా ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
ఇలాంటి పరిణామాల నేపథ్యం లో పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రష్యా లో రెండు రోజుల పాటు పర్యటన నిమిత్తం బయలు దేరారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ద్వైపాక్షిక సంబంధాలు పునరుద్ధరించడం పై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఉక్రెయిన్ పై రష్యా వ్యవహరిస్తున్న తీరు నేపథ్యంలో అమెరికా సహా యూరోపియన్ యూనియన్ నాటో దేశాలు రష్యా పై ఆర్థిక నిబంధనలు విధిస్తున్న నేపథ్యంలో ఇక ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ పర్యటన మాత్రం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి