పాకిస్థాన్ తాత్కాలిక ప్రధానమంత్రి ఇండియాపై విషం కక్కారు. సరిహద్దుల్లో భారత్ కావాలనే దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని ఉగ్రవాదుల నెపంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో దాడులకు దిగుతోందని ఆరోపిస్తున్నారు. ఉగ్రవాదులను కాశ్మీర్ లోకి పంపిస్తూనే మళ్లీ ఏమీ తెలియనట్లు భారతే తప్పు చేసినట్లు ఎత్తి చూపుతున్నారు.


కాశ్మీర్ లోకి ఉగ్రవాదులను పంపిస్తూ ఇక్కడి సైనికుల మీద దాడులు చేయిస్తున్నారు. అలాంటి ఉగ్రవాదుల మీద ప్రతీకారం తీర్చుకుంటుంటే భారత్ దాడులు చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఈ మధ్య కొండల్లో దాగిన ఉగ్రవాదులు నలుగురు భారత సైనికులను పొట్టన పెట్టుకున్నారు. భీకరమైన దాడుల తర్వాత ఆర్మీ సైనికులు నలుగురు ప్రాణాలు విడిచారు. దీంతో భారత ఆర్మీ ఈ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.


కచ్చితంగా ఎలాగైనా ఉగ్రవాదులను మట్టుబెట్టాలని దాదాపు వారం రోజుల పాటు శ్రమించి కొండ ప్రాంతాలు.. గుహాల్లో దాక్కున్న మిలిటెంట్లను కాల్చి చంపారు. ఇండియాలోని సైనికుల ప్రాణాలు పోయినపుడు స్పందించిన పాక్ ప్రధాని ఇప్పుడు మాత్రం భారత్ ఏదో చేస్తుందని విమర్శలు చేస్తున్నారు.


ఇరాన్, అప్గానిస్తాన్, భారత్ లాంటి అన్ని సరిహద్దు దేశాలతో  పాక్ కయ్యానికి కాలు దువ్వుతోంది. ఒక పక్క తినడానికి తిండి లేకుండా పోతున్నా కూడా పౌరుషానికి కొదవ లేదన్నట్లు పాక్ ప్రధాని మాటలు ఉన్నాయి. ముఖ్యంగా ఇండియా పాక్ ఆక్రమిత కశ్మీర్ లో దాడులు చేస్తుందని అంటున్నారు. భారత భూభాగంలోకి ఉగ్రవాదులను పంపిస్తే దాడులు చేయకుండా ఎలా ఉంటారని భారత్ పాక్ ను ప్రశ్నిస్తోంది. ఇకనైనా తన వైఖరి మార్చుకోవాలని పాక్ లో ఉగ్రవాదులకు చెక్ పెట్టాలని కోరుతుంది.  ఇప్పటికే పాక్ తయారు చేస్తున్న ఉగ్రవాదులు సొంత దేశంలో ఎన్నో విపరీత దాడులకు తెగ బడుతున్నారు. కాబట్టి తన వక్ర బుద్ధిని మార్చుకోవాలని భారత్ పాక్ ను హెచ్చరిస్తుంది. లేక పోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెబుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: