సాధారణంగా నిమ్మకాయలను ప్రతి ఒక్కరు కూడా వాడుతూనే ఉంటారు. అయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాడటం చేస్తూ ఉంటారు. చాలామంది ఇక వంటల్లో వేసుకోవడానికి నిమ్మకాయను వాడుతూ ఉంటారు. ఇంకొంద మంది పులిహోర చేయడానికి నిమ్మకాయను ఉపయోగిస్తారు. మరి కొంతమంది ఏకంగా ఇక దేవతలకు పూజలు చేయడానికి నిమ్మకాయలతో దండను తయారుచేసి తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలా నిమ్మకాయను ఒక్కొక్కరు ఒక్కోలా వాడుతూ ఉంటారు. అది సరేగాని ఇప్పుడు నిమ్మకాయ పంచాయతీ ఏంటి అంటారా.. అయితే నిమ్మకాయ మార్కెట్లో ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐదు రూపాయలకు ఒక నిమ్మకాయ ఇవ్వడం చేస్తూ ఉంటారు. మహా అయితే ₹10 వరకు ఉంటుంది.


 అదే ఎండిపోయిన నిమ్మకాయను ఎవరైనా కొంటారా.. నిగ నిగలాడుతున్న నిమ్మకాయనే ధర ఎక్కువగా ఉంటే కొనడానికి ఆలోచిస్తారు.. అలాంటిది ఎండిపోయిన నిమ్మకాయని ఎవరైనా కొంటారా అని అంటారు ఎవరైనా. కానీ ఇక్కడ ఎండిపోయిన నిమ్మకాయని కొన్నారు. అది కూడా పది రూపాయలకో 20 రూపాయలకో అనుకునేరు. ఏకంగా లక్షల రూపాయలు పోసి ఈ ఎండిపోయిన నిమ్మకాయను కొన్నారు. చాలామంది పాతకాలం నాటి వస్తువులను కార్లను కొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇందుకోసం భారీగా ఖర్చు పెట్టేందుకు కూడా వెనకడుగు వేయరు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకునే ఎండిపోయిన నిమ్మకాయ విషయంలో కూడా ఇదే జరిగింది అన్నది తెలుస్తోంది.



 285 ఏళ్ల నాటి నిమ్మకాయ కు వేలంలో ఊహించని ధర పలికింది. ఏకంగా ఈ ఏండిన నిమ్మకాయపై 1739 లో ఎవరో మరొకరికి ఒక సందేశం రాసినట్లు ఉంది. ఏకంగా ఒక కుటుంబానికి చెందిన పాత చెక్క బాక్స్ లో ఈ పురాతన కాలం నాటి నిమ్మకాయ కనుగొనబడింది. ముందుగా సరదా కోసమే ఎలాగైనా ఈ నిమ్మకాయని అమ్మాలని అనుకున్నారు. దాదాపు 4,000 నుంచి 6000 రూపాయల వరకు డబ్బులు వస్తాయని అనుకున్నారు. కానీ ఈ నిమ్మకాయ ఒక లక్ష 49 వేల రూపాయలకు అమ్ముడుపోయింది. ఇక ఈ విషయం తెలిసిన నేటిజన్స్ కూడా షాక్ అవుతున్నారు. ఇంత ధర పెడితే ఏకంగా టాప్ ఎండ్ ఐఫోనే కొనుగోలు చేయొచ్చు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: