ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఆంధ్ర ప్రదేశ్ కి ఒక మంచి రాజధాని కావాలి. ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు  ప్రకటించిన సంగతి తెలిసిందే.. అయితే ఈ  మూడు రాజధానుల వ్యవహారంపై ప్రతి పక్షాల నుంచి గొడవలు సవాళ్లు చాలా జరుగుతున్నాయి. రాజధానిపై  రెఫరెండా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు నాయుడు సవాల్ విసరగా.. అధికార పార్టీ కూడా ప్రతి సవాల్ విసురుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు.

తాజాగా గుంటూరులో మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యేలు, నేతల ర్యాలీ కూడా  చేశారు. మూడు రాజధానుల వల్ల ఏ ప్రాంతానికి నష్టం ఉండదన్నారు ఎమ్మెల్యే మద్దాలి గిరి. మూడు రాజధానులతో చంద్రబాబుకు తప్ప ప్రజలకు నష్టం లేదని.. ఐదేళ్లలో అమరావతిలో చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. రాజధాని రెఫరెండతో రాజీనామాకు తాను సిద్ధమన్నారు ఎమ్మెల్యే ముస్తఫా.. జగన్ ఆదేశిస్తే వెంటనే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తాను అన్నారు. జగన్ మోహన్ రెడ్డి  తమ అధినాయకుడని.. ఆయన చెప్పిన బాటలో నడవాలి కాబట్టి.. ఆయన సరే  అంటే ఆ మరు క్షణమే రాజీనామా చేయటానికి సిద్ధంగా వున్నాను అని అన్నాడు.ఇంకో వైపు టీడీపీ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ కూడా సంచలన కామెంట్స్  చేశారు.

మూడు రాజధానులా.. అమరావతా అనే దానిపై రెఫరెండంకు రెడీ అన్నారు. రెఫరెండంపై రాజీనామాకు తాను సిద్ధమని.. కృష్ణా జిల్లాల ఎమ్మెల్యేలు ఇందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కొంతమంది నోరు శుద్ధి లేని మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని.. ధైర్యం ఉంటే రాజీనామా చేసి ప్రజా క్షేత్రంలోకి తేల్చుకునేందుకు రావాలి అన్నారు. ప్రజలు మూడు రాజధానులకు అనుకూలంగా ఓటు వేస్తే చంద్రబాబు, నేను రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నాడు.. ఇక ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: