తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం జరిగే బతుకమ్మ పండుగకు ఎంత ప్రాముఖ్య ఉందొ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ పండుగను ప్రతి ఒక్కరూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ప్రతి ఒక్కరి ఇంట్లో పండుగలా పిల్లలు పెద్దలు సంతోషంగా జరుపుకుంటారు. ఈ పండుగ ప్రతి ఏటా ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి రోజున ప్రారంభం అవుతుంది. ఈ పండుగను మొత్తం తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ పండుగ దసరా పండుగ రెండు రోజులు ఉందనగా వస్తుంది. ఇంతకు ముందు వరకు ఒక స్థానిక పండుగగా మాత్రమే పరిగణించే ప్రజలు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత దీనిని రాష్ట్ర పండుగగా గుర్తించారు.

ఈ పండుగను తొమ్మిది రోజుల పాటుగా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుతారు. ఒక్కో రోజు ఒక్కో విధమైన అలంకరణతో నైవేద్యం సమర్పిస్తారు. ఇందులో అందరూ యువతీ యువకులే పాల్గొనడం విశేషం. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ గా స్టార్ట్ అయ్యి, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్న ముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ గా తొమ్మిది రోజులు తొమిది రకాల అలంకరణలతో పూర్తవవుతుంది. ఈ పండుగలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఆడపడుచులకు చీరలు పంపిణీ చేస్తుందని తెలిసిన విషయమే.

అదే విధంగా ఈ సంవత్సరం కూడా అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. అయితే ఈ సారి కొంచెం ముందుగానే  చీరల హడావిడి మొదలైంది. ఈ సంవత్సరం అక్టోబర్ 2 వ తేదీ నుండి చీరల పంపిణీ స్టార్ట్   చేయనున్నారు. ఇప్పటికే దీని కోసం మొత్తం 289 వివిధ రకాల చీరలను తయారు చేశారు. ఈ చీరలు అన్నీ కూడా సిరిసిల్ల లోనే చేయబడుతాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ చీరలను అన్ని జిల్లాలకు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. దీనితో ఎల్లుండి నుండే పండుగ వాతావరణం స్టార్ట్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: