హుజురాబాద్ ఎన్నిక‌ల ఫలితాల త‌రువాత కేసీఆర్ మ‌రింత జాగ్ర‌త్త ప‌డుతున్నారు. ఎప్ప‌టిలానే త‌న‌కు క‌లిసివ‌చ్చిన సెంటిమెంట్ పోలిటిక్స్ ను ప్లే చేయాల‌ని చూస్తున్నారు. ఇదే త‌రుణంలో రైతు స‌మ‌స్య‌ల‌పై సానుభూతి చూపుతూ రోడ్డెక్కుతూ ధ‌ర్నాలు చేస్తూ
మ‌ళ్లీ ఉద్య‌మ కాలం నాటి రోజుల‌ను ప్ర‌జ‌ల‌కు గుర్తుకు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇదే సంద‌ర్భంలో త‌న‌కు బాగా తెలిసిన రీతిలోనే కేంద్రంపై ఫైర్ అవుతున్నారు. తెలంగాణ జాతీయాలు వినిపిస్తూ ఆ ప్రాంత భాష‌లో ఉన్న సోయ‌గాన్ని జోడిస్తూ చాలా మాట‌లే చెబుతున్నారు. కానీ కేసీఆర్ ను ఈ సారి మ‌ళ్లీ ప్ర‌జ‌లు న‌మ్ముతారా అన్న‌దే పెద్ద సందేహం. మాట‌ల‌తో గారిడి చేస్తూ రాజ‌కీయం  చేసే కేసీఆర్ న‌మ్ముతారా అన్న‌దే ఇంకా పెద్ద సందిగ్ధం. ఈ తరుణాన కేసీఆర్ ఒక సేఫ్ జోన్ లో ఉంటూ కేంద్రం  పై యుద్ధం చేయ‌డం వ‌ల్ల సాధించేదేంటి? అలా అయితే ఇంత కాలం ఆయ‌న నోరు మెద‌ప‌క ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నార‌ని? ఇవ‌న్నీ ఆలోచిస్తే తెలంగాణ‌లో ఇంటి పార్టీ వైభ‌వం క్ర‌మ క్ర‌మంగా త‌గ్గిపోతూ వ‌స్తోంది. కేసీఆర్ ప‌ర్స‌న‌ల్ ఇమేజ్ కూడా అలా అలా త‌గ్గి పోతూనే ఉంది. గ‌తంలో చెప్పిన విధంగా కేసీఆర్ ఏమీ చేయ‌లేకపోయారు.

ఇదే ద‌శ‌లో కొద్దో గొప్పో బీజేపీనే రాణిస్తోంది. కాంగ్రెస్ కు అస్స‌లు కోలుకునే శ‌క్తే లేకుండా పోతోంది. కాంగ్రెస్ త‌ర‌ఫున రేవంత్ గొంతుక వినిపించినా ఎవ్వ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇవాళ ఢిల్లీ  కేంద్రంగా ఏఐసీసీ స‌మీక్షా స‌మావేశాల్లోనూ నువ్వెంత అంటే నువ్వెంత అని అధిష్టానం ఎదుటే  కొట్టుకున్నారు టీపీసీసీ లీడ‌ర్లు. ఇలాంటి సీనియ‌ర్లు ఉన్న చోట కేసీఆర్ కు గెలుపు సులువే అయినా కొంతలో కొంత బీజేపీ బ‌లం పుంజుకోవ‌డం ఆయ‌న‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తోంది.



గ‌తంలో మాదిరిగా కాంగ్రెస్ నాయ‌క‌త్వం ఉంటే ఇంకెందుకు ఆ పార్టీ అని చాలా మంది ప‌క్క పార్టీల వైపు చూసేందుకు అవ‌కాశం ఉంది. ఎలా అయినా ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ శ‌క్తుల అవ‌స‌రం ఉన్నందుకు ష‌ర్మిల ఆనందప‌డాలి. కానీ ఆమె ఇంకా పార్టీని క్షేత్ర స్థాయిలో బ‌లోపేతం చేయలేక‌పోయారు. ఈ త‌రుణాన కాంగ్రెస్ నుంచి కొంద‌రు, తెలంగాణ రాష్ట్ర స‌మితి నుంచి కొంద‌రు బీజేపీకి పోయి ప‌ర్స‌న‌ల్ ఇమేజ్ ను పెంచుకుని పోరాడితే మంచి ఫ‌లితం ఉంటుంది. అందుకే యాసంగిలో వ‌చ్చిన వ‌డ్ల కొనుగోలు అన్న‌ది ప్ర‌ధాన అజెండాగా తీసుకుని కేసీఆర్ రాజ‌కీయం చేస్తున్నాడు. అయితే ఇదే స‌మ‌యంలో బీజేపీ చెప్పిన మాట‌లూ ప‌రిగ‌ణించాలి. ఈ సారి త‌న ద‌గ్గర నుంచి వ‌డ్లు కొనుగోలు చేయాల్సిన ప‌నే లేద‌ని కేంద్రానికి కాగితం రాసిచ్చాక మాట త‌ప్పాడ‌ని విజ‌య‌శాంతి లాంటి బీజేపీ నాయ‌కులు ఫైర్ అవుతున్నారు. రైతుల‌కు రుణ‌మాఫీ అన్న‌ది లేకుండా ఇచ్చిన మాట త‌ప్పిన కేసీఆర్ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కూడా విప‌క్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే రాజకీయం ఎలా ఉన్నా రైతు ఎటు వైపు అన్న‌ది కొద్ది రోజులు ఆగితే తేలిపోనుంది. ఒక‌వేళ కేసీఆర్ పాల‌నకు విసిగి వేసారి పోతే త‌ప్ప ఓటు విప‌క్షంకు ప‌డ‌దు అలా అయితే త‌ప్ప కేసీఆర్ కు ఓట‌రు బైబై చెప్ప‌డు. ఆ స్థితికి కేసీఆర్ వెళ్తాడా? దిగ‌జారుడు రాజ‌కీయం చేస్తాడా? లేదా  ఎప్ప‌టిలానే హుందాత‌నం చాటుకోక సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకుని పాలిటిక్స్ నడిపిస్తాడా?

మరింత సమాచారం తెలుసుకోండి: