సాధారణంగా ఐపీఎస్ ఆఫీసర్ లు అంటే అద్దాలమేడ లాంటి ఇంద్రభవనం లో నివసిస్తూ ఉంటారు అని మాత్రమే అందరికీ తెలుసు. లగ్జరీ లైఫ్ లో బ్రతికేస్తూ ఉంటారు అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఇక కోట్ల రూపాయల ఆస్తులు కూడా కలిగి ఉంటారని... వందల ఎకరాల భూములు  కూడా ఉంటాయని నమ్ముతూ ఉంటారు. కానీ సినిమాలో కొంతమంది ఐపీఎస్ అధికారులు మాత్రం పెద్ద హోదాలో కొనసాగుతున్నప్పటికీ సాదాసీదా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇలాంటివి చూసినపుడు ఇలాంటి అధికారులు నిజజీవితంలో అస్సలు  ఉండరు అయినా  ఇలాంటివి కేవలం సినిమాలలోనే సాధ్యం అవుతూ ఉంటాయి అని అనుకుంటారు ప్రేక్షకులు.


 కానీ ఇక్కడ ఒక ఐపీఎస్ అధికారి గురించి తెలిసిన తరువాత రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి అధికారులు ఉంటారు అని ప్రతి ఒక్కరూ అవాక్కవుతారు అని చెప్పాలి. ఏపీ లోని అనంతపురం జిల్లా ఎస్పీగా కొనసాగుతున్న ఐపీఎస్ అధికారి  ఫకీరప్పపై పలు  ఇటీవలే ఆరోపణలు వినిపించాయి. అనంతపురం  జిల్లా ఎస్పీ పోస్ట్ కంటే ముందే కర్నూలు జిల్లా ఎస్పీగా కొనసాగారు ఆయన.  అంతేకాదు ఇటీవల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడంతో కాస్త ఇబ్బందులు కూడా పడ్డారు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానంగా తన వాస్తవ పరిస్థితి ఏంటి అన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు.


 ఈ క్రమంలోనే ఇటీవలే ఒక ఫోటో సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అది కాస్తా సంచలనంగా మారిపోయింది. కర్ణాటకలోని హవేరి జిల్లా నల్లగొల్  గ్రామం తన సొంత ఊరులో  తన ఇల్లు చూపిస్తూ ఒక ఫోటో విడుదల చేశారు. ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.  తన గురించి ఆరోపణలు చేస్తున్న వారికి తన ఇంటితోనే  సమాధానం చెబుతున్నారు అంటూ తెలిపారు.   తనపై అనుమానం ఉన్న వారంతా ఇక ఇల్లు గురించి   తెలుసుకోవాలి అంటూ ఒక కామెంట్ కూడా జత చేశారు.  ఆయన షేర్ చేసిన ఫొటోలో  ఒక పాత పెంకుటిల్లు కనిపిస్తూ ఉండటం గమనార్హం.  ఇక ఈ ఫోటో పై నెగిటివ్ కామెంట్లు కూడా వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ips