మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో మూడు ప్రదానపార్టీలు గెలుపుకోసం శాయశక్తుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. టీఆర్ఎస్ అధికారంలో ఉండటం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి కలిసొచ్చే అంశం. చేతిలో కోట్లరూపాయలు ఉండటం బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి బాగా అడ్వాంటేజ్. మరి కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతికి ఉన్న అడ్వాంటేజ్ ఏమిటి ? కాంగ్రెస్ తరపున టికెట్ దక్కటం ఒకటే ఆమెకున్న అడ్వాంటేజ్.





సరే ఇపుడు నియోజకవర్గంలో జరుగుతున్న ఖర్చులను చూస్తుంటే టీఆర్ఎస్-బీజేపీ ముందు కాంగ్రెస్ అభ్యర్ధి ఎందుకు పనికిరారు. బీజేపీ ఓటుకు రు. 30 వేలు ఇస్తున్నట్లు టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ ఓటును రు. 40 వేలకు కొనేందుకు ప్లాన్ చేస్తున్నట్లు బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సో ఆరోపణలను గమనిస్తే అంతపెద్ద మొత్తంలో కాకపోయినా ఎంతో కొంత ఇచ్చి ఓట్లు కొనుక్కోవటం ఖాయమని తేలిపోయింది.





ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పరిస్ధితి ఏమిటి ? పార్టీవర్గాల సమాచారం ప్రకారం ఓటుకు రు. 2 వేలు ఇవ్వాలని పార్టీ అగ్రనేతలు అనుకుంటున్నారట. పై రేట్లు చూసినతర్వాత డబ్బులు తీసుకునేవాళ్ళలో  కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా ఓట్లేస్తారా ? ఇక్కడే కీలకమైన పాయింట్ ఉందట. తప్పదన్నపుడు కాంగ్రెస్-టీఆర్ఎస్ కలిసేపోయే అవకాశముందని సమాచారం. ఎందుకంటే ఇద్దరికీ కామన్ శతృవు రాజగోపాలరెడ్డే. టీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీల్లో ఒకటి ఓడిపోవటం ఖాయమని తేలిపోయినపుడు ఆ పార్టీ రెండోపార్టీకి సహకరించే అవకాశముందట. అయితే ఆ పరిస్దితి గురించి తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. 





కాంగ్రెస్ మునుగోడులో ఓడిపోయినా జరిగే నష్టమేమీలేదు. అలాగే టీఆర్ఎస్ ఓడిపోతే కేసీయార్ పరువు జాతీయస్ధాయిలో పోవటం ఖాయం. అలాగే బీజేపీ గెలిస్తే కేసీయార్, కాంగ్రెస్ రెండింటికి పెద్ద సమస్య అయిపోతుంది. అందుకనే కామన్ శతృవును ఓడించేందుకు రెండుపార్టీల్లో ఒకటి మరోదానికి సహకరించుకునే అవకాశముంది. ఇదే జరిగితే కోమటిరెడ్డి ఓటమి ఖాయమని అంచనా. కేసీయార్, కాంగ్రెస్ కు రాజగోపాల్ ఓటమే ముఖ్యమైనపుడు కలిసేందుకే అవకాశాలున్నాయి కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: