తెలంగాణ లో ఇప్పుడిప్పుడే రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. బీజేపీ ఎప్పుడైతే బలపడిందో అప్పటినుంచే తెలంగాణ లో రాజకీయాల్లో కొత్తరకం జోష్ కనిపిస్తుంది.. గత ఏడేళ్లుగా తెరాస చూపిస్తున్న అధిపత్యానికి దుబ్బాక యూత్ ఎన్నిక చెక్ పెట్టింది. అక్కడ బీజేపీ పార్టీ బలమైన తెరాస పార్టీ ని ఓడించి గెలుపొందగా ఆ తర్వాత జరిగిన గ్రేటర్ ఎలక్షన్స్ లో నూ పార్టీ సరికొత్త జోష్ ని చూపించింది. గెలవకపోయిన గెలిచినంత పని చేసి తెరాస కు ముచ్చెమటలు పట్టించింది.