జగన్ ముఖ్యమంత్రిగా సీట్లో ఉన్నాడు. ఇది వూహకు కూడా భరించలేని విషయం. జన్మలో సీఎం కాలేడు జగన్ ఇది తెల్లారిలేస్తే టీడీపీ తమ్ముళ్ళు అనే మాటలు. ఇక చంద్రబాబు అయితే ఫలితాలు వస్తున్న రోజు కూడా రౌడీ  రాజకీయాలు చేసే వారికి జనం ఓటు వేస్తారా అంటూ గట్టిగానే మాట్లాడారు. తానే ఏపీకి దిక్కు అన్నట్లుగా బాబు వైఖరి అప్పట్లో  ఉంది. అయితే మే 23న వచ్చిన ఫలితాలతో టీడీపీకి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయిన సంగతి తెలిసిందే.


ఈ నేపధ్యంలో వైసీపీ సర్కార్ ఏర్పడిన తరువాత  అయిన దానికి కాని దానికి విరుచుకుపడిపోవడం టీడీపీకి అలవాటు అయిపోయింది. ఇపుడు వారికి వరదలు ఒక ఆయుధంగా మారాయి. ఎక్కడా సరిగ్గా సహాయ చర్యలు లేవంటూ బురద రాజకీయలు చేస్తూ మాజీ మంత్రులు రోడ్డున పడ్డారు. మధ్యలో డ్రోన్ రాజకీయాన్ని కూడా జోడించి కధ రక్తి కట్టిస్తున్నారు. చంద్రబాబు ఇంటి మీద డ్రోన్ ఎగరవేస్తారా అంటూ రంకెలు వేస్తున్నారు.


బాబుని హత్య చేస్తున్నారంటూ కూడా బుద్దా వెంకన్న లాంటి వారు మరింత ముందుకెళ్ళి ఆరోపణలు చేశారు. ఇవన్నీ ఇలా ఉంటే గవర్నర్ కి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు అంతటితో ఈ ఇష్యూని వదిలేస్తే పసుపు తమ్ముళ్ళు ఎలా అవుతారు. అందుకే కోర్టుకు వెళ్తారట. చంద్రబాబు ఇంటి మీద  డ్రోన్ ఎగరవేసిన దాంట్లో ముఖ్యమంత్రి జగన్ ఉన్నాడని ఆరోపిస్తూ ఆయన పేరు మీద కేసు పెట్టి మరీ కోర్టులో తేల్చుకుంటారట.


అంటే ఏదో విధంగా జగన్ని జనంలో అభాసుపాలు చేయాలన్నది టీడీపీ ఆలోచన అని తెలిసిపోతోంది. ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని జగన్ చెబుతూంటే అదే ఆరు నెలల్లో జగన్ని బదనాం చేద్దామని టీడీపీ కంకణం కట్టుకున్నట్లుంది. దాంతో వరద పేరు మీద బురద రాజకీయం చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ విమర్శించారు. మొత్తానికి ఈ వరద బురదను జగన్ ఎలా కడుక్కుంటాడన్నదే ఇపుడు పాయింట్.


మరింత సమాచారం తెలుసుకోండి: