చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు పరుగులు పెట్టింది.. కేంద్రం నుంచి నిధులు తెచ్చి చకచకా పనులు కానిచ్చారు.. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే.. మరో ఆరేడు నెలల్లో పోలవరం పూర్తయ్యేది.. ఇవీ తెలుగు దేశం నేతలు చెప్పే వాదనలు.. ఆ వాదనలకు తగ్గట్టే గత ఐదేళ్లు పోలవరంపై విపరీతమైన ప్రచారం జరిగింది.


కానీ అసలు వాస్తవం వేరంటోంది వైసీపీ.. ఆ పార్టీ వాదన ఏంటంటే..

"పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ పూర్తి కాలేదు. ఆర్ అండ్ ఆర్ పూర్తి కాలేదు. కాపర్ డ్యామ్ నిర్మాణం 35 మీటర్ల దగ్గరే ఆగిపోయింది, వరిజినల్ డిజైన్ 45 మీటర్లకు రావడానికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు పూర్తి అవలేదు. ఇంతవరకూ 3 డిజైన్లు కూడా ఖరారు కాలేదు. పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయని, డయాఫ్రం వాల్ పూర్తైందని, కాపర్ డ్యాం రెడీ అనీ తన ఎల్లో మీడియాలో విపరీతమైన ప్రచారం చేయించుకున్నాడు. ఉచిత బస్సులు పెట్టి వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రజలను పోలవరం యాత్ర చేయమని పంపించాడు.


సాంకేతికంగా పోలవరంలో ఏం జరుగుతోందా సామాన్యులకు అర్థం కాదు కనుక పోలవరం సందర్శించిన వాళ్లంతా బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయని భ్రమపడతారని చంద్రబాబు భావించాడు. కానీ బాబు అబద్ధాలను గుడ్డిగా రాష్ట్ర ప్రజలు నమ్మలేక పోయారు. కేంద్రం నిధులు ఇవ్వడానికి నిరాకరించడం, కాగ్ పోలవరం విషయంలో అవినీతి గురించి ప్రశ్నించడం, కమీషన్లు దండుకుంటూ పోలవరం పనులను నత్తనడకగా మార్చిన వైనాన్ని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ ఎండగట్టడం వంటి చర్యలు ప్రజలను ఆలోచింపచేసాయి.


ఒక్క డయాఫ్రంవాల్ కట్టేసి పోలవరమంతా పూర్తైపోయినట్టు బిల్డప్ ఇచ్చాడు చంద్రబాబు. కానీ ఆ ఒక్కటీ అయితే పోలవరం పూర్తయిపోదు. స్పిల్ వే పూర్తి కాలేదు. ఫ్లడ్ పోవడానికి కాపర్ డ్యామ్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. కాపర్ డ్యాం అసలు ఎత్తును ఇంతవరకూ పూర్తిగా నిర్మించనేలేదు. మెయిన్ డ్యాం పనులు మొదలుపెట్టే పరిస్థితి కూడా లేదు. సాంకేతిక పరంగా చూసినా గత ప్రభుత్వం చెప్పినట్టు 2018కో 2019కో పోలవరం పూర్తి కావడం అసంభవం. కేవలం వారి రాజకీయ అవసరాలకు మాత్రమే పోలవరం పనులు జరిగిపోతున్నట్టు, పూర్తి అయిపోతున్నట్టు తప్పుడు ప్రచారం చేసారు చంద్రబాబు.” ఇదీ వైకాపా వాదన.


మరింత సమాచారం తెలుసుకోండి: