వైఎస్ జగన్ సర్కారు సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే సాధ్యమైనన్ని హామీలు నెరవేరుస్తోంది. అందులో భాగంగానే ఆటోడ్రైవర్లుకు ఏటా పదివేల రూపాయల హామీని జగన్ పట్టాలెక్కిస్తున్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆటోడ్రైవర్ల కష్టాలను స్వయంగా చూసిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే.


జగన్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే హామీ నెరవేర్చే దిశగా ఇందుకు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ఈ నెల 14 నుంచి 24వ తేదీ వరకు ఆటో, మాక్సీక్యాబ్, టాక్సీ డ్రైవర్లు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. అదే విధంగా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తుల ప్రక్రియకు అధికారులు అవకాశం కల్పించారు.


అయితే ఈ పథకం నిబంధనల కారణంగా సగం మంది ఆటో డ్రైవర్లు ఈ కానుకకు దరఖాస్తు చేసుకోవడంలేదంటూ ఎల్లో మీడియాగా పేరున్న పత్రిక ఓ కథనం ప్రచురించింది. జగన్ ఇస్తానన్న ఆటో డ్రైవర్లు తీసుకోవడం లేదని తన పత్రికలో రాసుకొచ్చింది. ఏ పథకానికైనా అర్హులకు మాత్రమే అందించేందుకు నిబంధనలు ఉంటాయి.


ఆ నిబంధనల గురించి లబ్దిదారులకు అవగాహన కల్పించి... మరింత మందికి ఆ పథకం అందేందుకు సహాయపడాల్సిన మీడియా.. అదేదో ప్రభుత్వ తప్పదంలా చిత్రీకరిస్తూ వార్త రాయడం వారి కుత్సిత బుద్దిని చెప్పకనే చెప్పింది. జగన్ ఏంచేసినా గుడ్డిగా వ్యతిరేకించాలని డిసైడ్ అయిన ఆ పత్రిక నుంచి ఇలాంటి కథనాలు రావడం సాధారణమే అయినా ప్రజలకు మేలు చేసే పథకానికి కూడా ఇలాంటి ముసుగేయడం దారుణం.


ఆ పత్రిక అంతలా రాసుకొస్తున్నా.. ఇప్పటి వరకు ఈ పథకంలో భాగంగా మొత్తం 1,75,218 దరఖాస్తులు రవాణాశాఖకు అందాయి. వీటిలో శుక్రవారం వరకూ వరకు 93,741 దరఖాస్తులను పరిశీలించి ఆమోద ముద్ర వేశారు. అక్టోబర్ 4 న జగన్ చేతుల మీదుగా ప్రారంభం చేయనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: