ఈ మధ్య ఒక విషయం గమనించారా.. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ప్రతి నాయకుడికి, ప్రముఖులకూ జన్మదిన శుభాకాంక్షలు పెడుతున్నారు. చిరంజీవి మొదలుకుని, మోడీ, అమిత్ షా వరకూ ఎవరినీ వదలడం లేదు. తాజాగా ములాయం సింగ్ యాదవ్ పుట్టినరోజుకు కూడా ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఈ విషయంలో ఆయన కుమారుడు నారా లోకేశ్ కూడా తండ్రితో పోటిపడుతున్నారు.

 

 

ఎవరి పుట్టిన రోజు ఉన్నా.. ట్విట్టర్ లో ఓ శుభాకాంక్షల పోస్టు పెట్టేస్తున్నారు. దీనిపై వైసీపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు. ఎన్నిక‌ల‌ప్పుడు న‌రేంద్రమోడీని ఇంటికి పంపేదాకా నిద్రపోయేది లేద‌ని శ‌ప‌థాలు చేసిన చంద్రబాబు... ఎన్నిక‌ల‌య్యాక కార్యక‌ర్తల మీటింగ్‌లో మోడీతో విభేదించి త‌ప్పు చేశామ‌ని యూట‌ర్న్ తీసుకున్నాడ‌ని పేర్ని నాని మండిపడ్డారు. మోడీ వ్యతిరేకంగా జ‌ట్టు క‌ట్టడానికి దేశ‌మంతా తిరిగి కాళ్లావేళ్లా ప‌డిన బాబు.. ఎన్నిక‌ల ఫ‌లితాలువచ్చిన నాటి నుంచి ఒక్కసారైనా సోనియాని గానీ, మ‌మ‌తాని గానీ ప‌ల‌క‌రించారా అని ప్రశ్నించారు.

 

 

అమిత్‌షా పుట్టిన‌రోజుకి తండ్రీ కొడుకులు పోటీలు పెట్టుకుని మ‌రీ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు చెప్పలేదా అని మంత్రి పేర్ని నాని అన్నారు. సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కులం గురించి మాట్లాడే ప‌వ‌న్‌నాయుడు ఎన్నిక‌లకు ముందు బాప్టిజం తీసుకున్నాన‌ని, తాను క్రిస్టియ‌న్‌న‌ని చెప్పలేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ బ‌డుల్లో ఇంగ్లిష్ వ‌ద్దంటున్న ప‌వ‌న్.. తాను నెల్లూరులో ఇంగ్లిష్ మీడియంలో చ‌ద‌వారో లేదా చెప్పాల‌న్నారు. క్రిస్టియ‌న్ స్కూల్లో చేరిన త‌ర్వాత‌నే త‌న‌కు దేశ‌భక్తి అల‌వ‌డింద‌ని ప‌వ‌న్ చెప్పిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేశారు.

 

 

అనుకూల మీడియా ఎన్ని జాకీలేసి లేపినా నారా లోకేష్‌నాయుడు ఎప్పటికీ నాయ‌కుడు కాలేడ‌న్నారు. గ‌డిచిన ఐదేళ్ల‌లో ఎన్ని అస‌త్య ప్రచారాలు చేసినా జ‌నం మంచీచెడుల తేడాను గుర్తించార‌ని, వైఎస్ార్‌సీపీకి ప‌ట్టం క‌ట్టార‌ని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: