నాణేనికి రెండు ముఖాలు ఉన్నట్టుగానే న్యాయానికీ ఉంటాయి. కొందరికి న్యాయం అనిపించింది.. మరికొందరికి అన్యాయంగా కనిపించవచ్చు.. దిశ రేపిస్టుల కుటుంబాల వాదన అలాగే ఉంది. నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు అనే వ్యక్తి భార్య తన భర్తను అన్యాయంగా పోలీసులు చంపేశారని రేణుక ఆరోపిస్తోంది. ఈ లోకంలో భర్త ఒక్కడే ఇలాంటి తప్పు చేశాడా.. ఇంకెవరూ చేయలేదా.. ఇలాంటి తప్పు చేసిన అందరినీ ఇలాగే చంపేస్తున్నారా.. అంటూ ఆమె నిలదీసింది.

 

అయితే రేణుక వాదనపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వాదనపై నటి జీవిత స్పందించారు. భార్యగా ఆమెకు ఆవేదన ఉండొచ్చు. కానీ మేమే అత్యాచారం చేశాం, మేమే హత్య చేశాం అని పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. ఇంతకంటే ఆధారాలు ఇంకేం కావాలి.
తన భర్త చనిపోయిన బాధలో ఆమె మాట్లాడుతోంది. కానీ అలాంటి భర్త ఆమెకు అవసరమా అని జీవిత ప్రశ్నించారు.

 

తన భర్త ఘోరం చేశాడని, ఎలాంటి శిక్ష విధించినా పర్వాలేదు అని చెన్నకేశవులు భర్త కొన్ని రోజుల క్రితం మాట్లాడింది. ప్రస్తుతం ఆమె భర్త చనిపోయాడనే బాధలో మాట్లాడుతోంది అని జీవిత అన్నారు. అంతకుముందు రేణుక మాట్లాడుతూ... తన భర్తను ఎన్‌కౌంటర్ చేసినట్లుగానే, అత్యాచార కేసుల్లో నిందితులుగా జైళ్లలో ఉన్నవారిని కూడా చంపేయాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు జనానికి సంతోషంగా ఉందా.. ఎన్‌కౌంటర్ జరిగినందుకు దేశ ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారు కదా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

 

 

గతంలో ఇలాంటి సంఘటనలు చేసిన నిందితులను కూడా ఇలానే కాల్చేయాలని డిమాండ్ చేస్తోంది. ఒక అమ్మాయి కోసం నలుగురిని పొట్టనబెట్టుకున్నారని.. దిశ తన చెల్లెలికి కాకుండా పోలీసులకు ఫోన్ చేసుంటే ఈ ఘోరం జరిగి వుండేది కాదని ఆమె పేర్కొంది. ఏదేమైనా దిశపై అత్యాచారం జరిగింది.. ఆ తర్వాత ఎన్ కౌంటర్ జరిగింది. నిందితులకు సరైన శిక్ష పడిందన్నది మెజారిటీ ప్రజల అభిప్రాయంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: