తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లాలోని నడికూడి మండలం రాయపర్తి గ్రామంలో ఎస్వీ స్కూల్ వ్యాన్ కింద పడి మూడు సంవత్సరాల పాప మృతి చెందింది. పాప కుటుంబ సభ్యులు డ్రైవర్ నిర్లక్ష్యం వలనే పాప మృతి చెందిందంటూ ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
డ్రైవర్ నిర్లక్ష్యం వలనే నిండు ప్రాణం బలైనట్లు తెలుస్తోంది. అశ్విత అనే మూడు సంవత్సరాల చిన్నారిపై వాహనం ఎక్కడంతో పాప అక్కడికక్కడే మృతి చెందింది. అశ్విత అక్క ప్రతిరోజు స్కూల్ బస్సులో పాఠశాలకు వెళ్లేది. అక్కను బస్సు ఎక్కించటం కొరకు తల్లితో పాటు వెళ్లిన అశ్విత డ్రైవర్ వాహనాన్ని వేగంగా నడపటంతో బస్సు వెనుక టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. 
 
పాప మృతితో రాయపర్తి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామస్థులు బస్సును ఆపి అశ్విత కుటుంబ సభ్యులతో పాటు ఆందోళనకు దిగారు. పోలీసులు నచ్చజెప్పటంతో అశ్విత తల్లిదండ్రులు ఆందోళన విరమించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యులు పాఠశాల యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 
 
మూడేళ్ల చిన్నారి అశ్విత మృతితో ఆమె తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. బస్సు చక్రాల కింద పడి పాప తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో పాప తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. బస్సు డ్రైవర్ రమేష్ పాపను గమనించలేదని చెబుతున్నట్లు తెలుస్తోoది. డ్రైవర్ ను కఠినంగా శిక్షించాలని రాయపర్తి గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అనుభవం లేని డ్రైవర్లను నియమించుకోవటం వలనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 


 
 

మరింత సమాచారం తెలుసుకోండి: