తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో కొత్త సంవత్సరంలో కొత్త లక్ష్యాలు నిర్దేశించుకోవాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణను వందశాతం అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రజలు ప్రతిన బూనాలని కేసీఆర్ ప్రజలకు సందేశం ఇచ్చారు.
సంపూర్ణ అక్షరాస్యత సాధించే సవాల్‌ను స్వీకరించాలని, ‘ప్రతి ఒక్కరు మరొకరికి బోధించాలి’ అనే నినాదం స్ఫూర్తితో ప్రతీ విద్యావంతుడు నిరక్షరాస్యుడైన మరొకరిని అక్షరాస్యునిగా మార్చాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై త్వరలోనే తెలంగాణ సర్కారు మాస్టర్ ప్లాన్ ప్రారంభిస్తుందన్నారు కేసీఆర్. రాష్ట్రం ఆవిర్భవించిన ఆరేళ్ల స్వల్ప వ్యవధిలోనే అనేక విషయాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలవడం గర్వకారణమని సీఎం అన్నారు.
పారిశ్రామిక, ఐటీ రంగాల్లో దూసుకుపోతున్నా.. నిరక్ష్యరాస్యతతో అప్రతిష్ఠ..వస్తోందని.. అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచినా.. తెలంగాణ అక్షరాస్యతలో వెనుక వరుసలో ఉండడం ఓ మచ్చగా మిగిలిందన్నారు కేసీఆర్. గత పాలకులు అందరినీ అక్షరాస్యులను చేయడంలో విఫలం కావడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఈ దుస్థితిని రాష్ట్రం అధిగమించి తీరాలని.. ఉద్యమ సమయంలో ప్రజలంతా ఉద్విగ్నభరితమైన పోరాటం చేసి లక్ష్యం సాధించారని గుర్తు చేశారు.
ఒకే ఒక్క రోజులో సమగ్ర కుటుంబ సర్వే జరిపాం. అదే స్ఫూర్తితో రాష్ట్రాన్ని వందశాతం అక్షరాస్యత సాధించేలా అందరూ కంకణబద్ధులు కావాలి. ఈ యజ్ఞంలో అందరూ భాగస్వాములై అక్షరాస్యత విషయంలో అప్రతిష్ఠను రూపుమాపాలి. తద్వారా రాష్ట్రం గొప్ప ప్రగతికాముక రాష్ట్రంగా భాసిల్లాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు
ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘‘ఆరేళ్ల క్రితం ఏర్పడిన తెలంగాణ అన్నిరంగాల్లో ప్రగతిపథంలో దూసుకెళ్తూ గొప్ప విజయాలు సాధించింది. అనేక అంశాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచి, ఎందరో ప్రశంసలు అందుకుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులను రాష్ట్రం సొంతం చేసుకుందన్నారు కేసీఆర్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి