నారా వారి కోడలు నారా బ్రాహ్మణి చాలా తెలివిగా తప్పించుకున్నట్లే ఉంది చూడబోతే. రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా రైతులు 30 రోజులుగా చేస్తున్న ఆందోళనల్లో గురువారం బ్రాహ్మణి కూడా  దీక్షలో కూర్చున్నది.  జనవరి 1వ తేదీన  ఎర్రుబాలెంలో రైతుల దీక్షలో కూర్చున్నపుడు చంద్రబాబునాయుడుతో పాటు భువనేశ్వరి కూడా పాల్గొన్న విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. దీక్షలో కూర్చున్న భువనేశ్వరి ఊరికే కూర్చోకుండా ఉద్యమ విరాళం అంటూ తన చేతి గాజులను ఇచ్చేసింది.

 

ఎప్పుడైతే ఉద్యమ విరాళం కోసం తన గాజులను ఇచ్చిందో వెంటనే  అధికారపక్షం నుండి ఆరోపణలు, విమర్శలు మొదలయ్యాయి.  దాదాపు మూడు రోజుల పాటు గాజుల వివాదం పెద్ద ఎత్తున కంటిన్యు అయ్యింది. సరే అత్తగారి పర్యటన తర్వాత కోడలు రావటమే ఆలస్యం అనుకున్నారు అందరూ. అయితే బ్రాహ్మణి మాత్రం రాజధాని గ్రామాల్లో జరుగుతున్న ఆందోళనవైపు కనీసం తొంగి కూడా చూడలేదు.

 

ఒకవైపు మామగారు చంద్రబాబు ఇంకోవైపు భర్త నారా లోకేష్ రెగ్యులర్ గా రాజధాని గ్రామాల్లో తిరుగుతున్న విషయం చూస్తున్నదే. మొన్నటి ఎన్నికల్లో లోకేష్ గెలుపు కోసం మంగళగిరిలో  పర్యటించి ప్రచారం చేసింది. సరే ఎవరెంత పర్యటించినా, ప్రచారం చేసినా  లోకేష్ గెలవలేదనుకోండి అది వేరే సంగతి.  దానికి తోడు పార్టీ కూడా ఓడిపోవటంతో బ్రాహ్మణి అటువైపు వెళ్ళాల్సిన అవసరం కూడా రాలేదు.

 

అయితే గడచిన 30 రోజులుగా రైతులు ఎంత ఆందోళన చేసినా  బ్రాహ్మణి మాత్రం అటువైపు చూడలేదు. అలాంటిది మొత్తానికి ఈరోజు తన మేనత్త లోకేశ్వరితో కలిసి బ్రాహ్మణి ఆందోళనల్లో పాల్గొంది. కోడలు వస్తోంది కాబట్టి అత్తగారు కూడా రెండోసారి వచ్చారు లేండి. అయితే  అత్తగారు లాగ కోడలు ఎటువంటి విరాళం ప్రకటించలేదు. దాంతో కోడలు దీక్ష సందర్భంగా ఎటువంటి కాంట్రవర్సీ రేగలేదు. మొత్తానికి విరాళం ప్రకటించి అత్తగారు వివాదాల్లో ఇరుక్కుంటే ఏమీ ప్రకటించకుండా కోడలు మాత్రం వివాదాలు రాకుండా జాగ్రత్త పడింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: