ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ముందుగా ఊహించిందే అయినా ఉత్కంఠభరితంగా ఈ ఫలితాలను ప్రజలు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. సుదీర్ఘకాలం ఢిల్లీ పీఠాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయింది. ఎవరూ ఊహించని విధంగా క్రేజీవాల్ పార్టీ ఫలితాలను సాధించి కాంగ్రెస్ ను  ఢిల్లీలో లేకుండా చేయగలిగింది. ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్ సైతం మొన్నటి ఎన్నికల్లో ఓటమి చెందడంతో కాంగ్రెస్ డీలా పడింది. ఇక అప్పటి ఎన్నికల్లో బిజెపి  మోడీ హవాను ఉపయోగించుకుని 7 ఎంపీ సీట్లు గెలుచుకున్న ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 15 సీట్లు గెలుచుకోవడమే కష్టంగా ఉంది.


ఇక కాంగ్రెస్‌ పార్టీ ఈసారి కూడా బోణీ చేయకపోవచ్చని కొన్ని సర్వే సంస్థలు అభిప్రాయపడ్డాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడంతో మళ్ళీ కాంగ్రెస్ లో ఆశలు చిగురిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఢీలా పడుతున్న నేపథ్యంలో ఢిల్లీ పీఠంపై కాంగ్రెస్ కూడా ఆశలు పెట్టుకుంది. గతంలో కాంగ్రెస్ కు ఢిల్లీ కంచుకోటలా ఉండడం, మూడు దపాలు వరుసగా ఢిల్లీ పీఠాన్ని అవరోధించడం ఇవన్నీ కాంగ్రెస్ ఇప్పుడు ఆశలు పెట్టుకోవడానికి కారణం. అయితే ప్రజలు మాత్రం ఆమ్ ఆద్మీ చేపట్టిన అభివృద్ధి పనులను చూసి ఆ పార్టీ వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. 


వాస్తవంగా చెప్పుకుంటే ఢిల్లీ లో బీజేపీ అధికారం చేపట్టాలనే ఆశతో ఉంది. కేంద్రంలో అధికారంలో ఉండడం అగ్ర నేతలంతా నిత్యం ఢిల్లీ నుంచే రాజకీయ కార్యకలాపాలు చేస్తుండడంతో ఢిల్లీ కూడా తమ ఖాతాలో పడితే ఇక తిరుగులేకుండా ఉండేదని ఆ పార్టీ భావిస్తూ వచ్చింది. కానీ ఓటర్లు మాత్రం ఆమ్ ఆద్మీ వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఫలితాలు మరి కొద్దిసేపట్లో తేలనుండడంతో అన్ని పార్టీల నాయకులూ, ప్రజలు ఉత్కంఠగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో రెండు మూడు సీట్లు దక్కేలా కనిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: