యుగాలు మరీనా ప్రపంచంలో మారానిది ప్రేమ భావన ఒక్కటే. ఈ భూమి మీద మానవులు ఉంతా కాలం ఈ ప్రేమ కూడా ఉంటుంది. ప్రేమకు నిర్వచనం ఏంటి అని ఎవరిని అయిన అడిగితే రాధా అనే రెండు అక్షరాలు సరిపోతాయి. ప్రేమ అంటేనే రాధా రాధా అంటేనే ప్రేమ ఇంతకు మించిన నిర్వచనం ప్రపంచంలోనే లేదు. 

 

 

వీరిది ఇది స్వచ్ఛమైన, నిస్వార్ధమైన, మరణంలేని ప్రేమకు ఒక ఉదాహరణ. కృష్ణుడు, విష్ణువు ఎనిమిదో అవతారంగా ఉండగా, రాధా లక్ష్మి దేవత అవతారంగా చెప్పబడుతున్నది. కృష్ణునికి అనేక మంది భార్యలు ఉన్నా కానీ అతని ఆత్మ మాత్రం ఎల్లప్పుడూ రాధనే. రక్షించడoలో భాగంగానే అతను చాలామందిని వివాహం చేసుకున్నాడు. రాధాకృష్ణ అనే పదాలలో ఏ ఒక్కటి లేకపోయినా అసంపూర్ణంగానే ఉంటాయి. 

 

 

వారి దైవప్రేమ అసమానమైనది. వారి ప్రేమ ఈ భూమి ఉన్నంతకాలం నిలిచి ఉంటుంది. అనడంలో ఆశ్చర్యంలేదు. ఏది ఏమైనా , రాధాకృష్ణులు ఒకరినొకరు పెళ్లి చేసుకోకపోవడం మాత్రం భక్తులను భాదించే విషయమే. రాధా కృష్ణుల వివాహం జరగకపోవడానికి గల కారణాల గురించి చాలా కథలు ప్రబలంగా ఉన్నాయి, రాధా కృష్ణుల వివాహం జరగక పోవడానికిగల కొన్ని కారణాలను ఇక్కడ పొందు పరచబడినవి.

 

 

కృష్ణుడి తన భార్య వీర్జతో కలిసి తోటలో కూర్చున్నాడు. ఆ సమయాన రాధ అక్కడ లేదు. ఆమె వచ్చి, వారిద్దరిని చూసి చాలా బాధపడింది. ఆమె కోపంతో కృష్ణుడిని దుర్భాషలాడడం మొదలుపెట్టింది. ఈ పరిణామం వీర్జకు నచ్చలేదు.దింతో ఆమె రాధను ఒక నదిగా మారాలని శాపం పెడుతుంది.

 

 

దింతో రాధా కృష్ణుడి దరి చేరకూడదని అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయింది. ఈ పరిణామంతో కృష్ణుడు చాలా నిరాశ చెందాడు. రాధ కూడా కృష్ణుని తో మాట్లాడుటకు సంసిద్దత వ్యక్తపరచలేదు. తద్వారా రాధా కృష్ణుల మధ్య అఘాధం పెరిగిపోయింది. తనకు మానసిక సన్నిహిత్యమే సంతోషాన్ని ఇచ్చిన రాధా కృష్ణుడి నుండి దూరంగా వెళ్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: