ఏపీ  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానిల ప్రకటన చేసినప్పటి నుంచి ఆంధ్ర రాజకీయాల్లో  అమరావతి పరిరక్షణ సమితి పేరిట ఉద్యమాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది అమరావతి పరిరక్షణ సమితి పేరిట ఉద్యమాలకు పిలుపునిస్తూ ఆ తర్వాత మూడు నాలుగు రోజులు అయినాక క్యాన్సల్ చేసుకుంటూ ఉండటం ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో  ఆసక్తికరంగా మారింది. అయితే అమరావతి పరిరక్షణ సమితి సభ్యులని చెప్పుకుంటున్న వ్యక్తులు ఎందుకు ఉద్యమాన్ని ప్రకటించి.. మళ్లీ ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే ఆంధ్ర రాజకీయాల్లో మూడు రోజులకు మెగాస్టార్ చిరంజీవి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మంచిది అంటూ సమర్థించారు మెగాస్టార్ చిరంజీవి.. 

 

 

 ఇక అదే సమయంలో జనసేన పార్టీ అధినేతగా విపక్ష నేతగా ఉన్న పవన్ కళ్యాణ్ మూడు రాజధానిల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ర్యాలీలు చేస్తూ అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొంతమంది వ్యక్తులు పవన్ కళ్యాణ్ కి చిరంజీవి మధ్య కొన్ని వివాదాలను రేకెత్తించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన మెగా బ్రదర్ నాగబాబు... ఓ వైపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ను సమన్వయం చేస్తూనే జనసేన పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా మద్దతు ప్రకటిస్తూ వెన్నుదన్నుగా నిలిచారు. 

 


 అయితే చిరంజీవి పవన్ కళ్యాణ్ పార్టీల పరంగా ఎలా ఉన్నప్పటికీ పార్టీల సిద్ధాంతాలు ఎలా ఉన్నప్పటికీ.. అభిమానులు మాత్రం ఒక్కటే అని మరొక సారి చాటి చెప్పారు. మెగా ఫ్యాన్స్ మరోసారి బాధ్యతాయుతంగా వ్యవహరిం చారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ తర్వాత కాంగ్రెస్లో కొనసాగి కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసినప్పటికీ.. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి కాంగ్రెస్ కు  వ్యతిరేకంగా విమర్శలు చేయడమే కాదు.. ప్రస్తుతం బిజెపి పార్టీలో కొనసాగుతున్నప్పటికీ.. రాజకీయంగా వీరిద్దరి సిద్ధాంతాలు వేరు అయినప్పటికీ... వీరిద్దరి అభిమానులు మాత్రం ఒక్కటే అని మరోసారి నిరూపితం అయింది. కాగా చిరంజీవి పవన్ కళ్యాణ్ మధ్య వివాదాలు రేకెత్తించేందుకు ప్రయత్నించిన కొంతమంది వ్యక్తుల పై మెగా స్టార్... పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చర్యలు తీసుకునేందుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: