ఏపిలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ విజయ ఢంకా మోగించింది.  అప్పటి అధికార పార్టీ టీడీపీ చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.  ఒక పార్టీ గెలవాలంటే ప్రజల్లో ఎంత నమ్మకం సంపాదించాలో.. ఒక పార్టీ దారుణంగా ఓడిపోయిందీ అంటే ప్రజల్లో ఎంత అపనమ్మకం ఏర్పడిందో తెలిసిపోతుంది.  టీడీపీ ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయింది.. అందుకే ఈసారి కొత్త పార్టీకి పట్టం కట్టారు.  వైసీపీ పార్టీ అధికారంలో రావడానికి ఎంత గొప్ప కృషి చేసిందో అందరికీ తెలిసిందే.  సీఎం జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ప్రజల్లో ఒకరిగా ప్రజల కష్టాలు గమనించి వారికి నేనున్నాని భరోసా ఇచ్చారు.. ఆ నమ్మకమే ఆయన గెలుపు బాట పట్టించింది. 

 

అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి చిన్న విషయానికి రాద్దాంతం చేస్తూ ప్రతిపక్ష నేతలు తెగ హంగామా చేస్తున్నారు. మొన్నటి వరకు రాజధాని మార్పు పై పెద్ద రగడ చేశారు.  రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలు అదే పనిగా విమర్శలు గుప్పించడం మొదలయ్యాయి.  ఇప్పుడు ఏపిలో స్థానిక ఎన్నికల హడావుడి మొదలైంది. దాంతో టీడీపీ కొత్త వ్యూహాలు పన్నడం మొదలు పెట్టింది.  ఇక టీడీపీ నేతపై తనదైన సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న వైసీపీ నేత విజయసాయిరెడ్డి తాజాగా చంద్రబాబు పై మరోసారి ఫైర్ అయ్యారు. 

 

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి తీరుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రెండేళ్ల క్రితం జరగాల్సిన స్థానిక ఎన్నికలకు అడ్డంకులు సృష్టించింది చాలక ఇంత హడావుడి ఏంటని ప్రశ్నిస్తున్నారు.   ఇక తమరు గెలవాంటే మందు, డబ్బు పంపిణీ చేయాల్సిన దుస్థితి ఏర్పడేది.. ఈసారి ఆ విషయంలో కట్టుదిట్టం చేస్తే ఇక గెలవలేం అని చేతులు ఎత్తేశారని ఎద్దేవా చేశారు. అంతే కాదు ఇంత దివాళాకోరు రాజకీయాలెందుకు బాబూ. నీవల్ల కాదు గానీ కుల మేధావి కిరసనాయిలు  సలహా ప్రకారం నడుచుకో' అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: