తాజాగా 33 మంది సుప్రీం కోర్టు న్యాయవాదులు ఒక్కొక్కరి చొప్పున 55 వేల రూపాయలు ప్రధాని మోడీ యొక్క పీఎం కేర్స్ చారిటీ కి విరాళంగా ఇచ్చారు. ఈరోజు ఒక్కరోజే యునైటెడ్ కింగ్డమ్ లో 500 కరోనా మరణాలు సంభవించాయని ప్రపంచ వార్త సంస్థ వెల్లడించింది. మహారాష్ట్రలో సోమవారం ఉదయం నుండి 32 కొత్త కేసు నమోదు కాగా తాజాగా 56 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో మొత్తం కరోనా పీడితుల సంఖ్య 355 కి చేరుకుందని మహారాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.


భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ఆర్మీ జవాన్లు నిరంతరం కృషి చేయాలని రాజనాథ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి కోవిడ్ 19 నివారణ కొరకై పీఎం కేర్స్ ఫండ్ కి కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారు. అలాగే తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి 50 లక్షల రూపాయలను, హైదరాబాద్ కి కూడా 50 లక్షల రూపాయలను ఆయన విరాళంగా ఇచ్చారు.


ఇకపోతే తాజాగా చైనా ప్రభుత్వం ఒక విస్తుపోయే నిజాన్ని వెల్లడించింది. 1, 541 మందికి కరోనా వైరస్ సోకినప్పటికీ... వారిలో దగ్గు జలుబు జ్వరం లాంటి లక్షణాలు ఏమీ కనిపించడం లేదని... వీరంతా కరోనా వైరస్ ని ఇతర ప్రజలకు వ్యాప్తి చేస్తారు తప్ప వారి ప్రమాదానికి ప్రాణాలకి ఏమి హాని ఉండదని చైనా తెలిపింది.


మహారాష్ట్రలోని ఓ గ్రామ సర్పంచ్... ఎవరైతే లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ రోడ్డు మీదకు వస్తున్నారో... వారందరినీ గాడిద మీద ఊరేగిస్తానని హెచ్చరించారు. హర్యానా రాష్ట్రంలో ఈ రోజు ఏ కొత్త కేసు నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతానికి 29 కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.



ఒక్కసారి తెలుగు రాష్ట్రాల నుండి ప్రపంచవ్యాప్తంగా కేసుల కేసుల సంఖ్య చూసుకుంటే...


ప్రపంచంలో మొత్తం కేసులు: 884,996
మరణాలు: 44,200
రికవరీ కేసులు: 185,196


ఇండియాలో మొత్తం కేసులు: 1804
మరణాలు: 31
కొత్త కేసులు: 247
రికవరీ కేసులు: 100

తెలంగాణలో మొత్తం కేసులు: 97
మృతులు: 6
ఏపీలో మొత్తం కేసులు: 87
మృతులు: 0


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: