ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా తో సహా నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీనికి కారణం ఆ జిల్లాలకు చెందిన ప్రజలు ఢిల్లీ లోని తబ్లీజీ జమాత్ ప్రార్థనలలో పాల్గొనడమేనని తెలుస్తోంది. ఈ మూడు జిల్లాల్లో కేసుల సంఖ్య ఆందోళనకరంగా పెరిగిపోతుండడంతో... రాష్ట్ర యంత్రాంగం ఆయా ప్రాంతాలలో హైఅలర్ట్ ప్రకటించింది. ఈ మూడు జిల్లాల్లో కేసుల సంఖ్య ఇంకా అధికంగా పెరిగిపోకుండా లాక్ డౌన్ నిబంధనలు మరింత కట్టుదిట్టం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.


గత 24 గంటల్లో కొత్తగా 45 పాజిటివ్ కేసులు నమోదు కాగా... ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 304 కి పెరిగింది. ఒక్క కర్నూలు జిల్లాలోనే 16 కొత్త కేసులు నమోదు కాగా మొత్తం కరోనా పీడితుల సంఖ్య ఏకంగా 74 కి చేరుకుంది. 304 కరోనా రోగులలో సగం మంది కర్నూలు, గుంటూరు, నెల్లూరు జిల్లా వాసులే ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దాంతో ఆయా జిల్లాల్లో నివసించే ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వారికి ధైర్యం చెబుతూ... మీ ప్రజలందరి సహకారంతోనే ఈ ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ నిరోధించగలమని... అందుకుగాను ప్రతి ఒక్కరూ ఎటువంటి నిర్లక్ష్యం చూపించకూడదని, లాక్ డౌన్ నిబంధనలను పాటించాలని చెప్పుకొచ్చింది.


అలాగే ఈ మూడు జిల్లాలో ప్రత్యేకమైన చర్యలను చేపడుతుంది అధికార యంత్రాంగం. ఇందులోని భాగంగానే ఆయా జిల్లాలలోని కరోనా రెడ్ జోన్లుగా నిర్ణయించిన ప్రాంతాలలో మాంసం, చేపల విక్రయాలను పూర్తిగా నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలను చేస్తుంది. మాంసాహారం తింటే కరోనా వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ప్రముఖ వైద్యులు చెప్పారు. అందుకే ఇప్పటికే నెల్లూరు జిల్లాలో మాంసాహార మార్కెట్లను పూర్తిగా బంద్ చేస్తున్నామని అధికారులు తెలపగా... మిగతా జిల్లాల్లో కూడా ఈ నిషేధం త్వరలోనే అమలులోకి వస్తుందని తెలుస్తోంది. ఇకపోతే కరోనా వైరస్ తీవ్రత తక్కువగా ఉన్న జిల్లాల్లో మాంసం అమ్మకాల పరిమితిని తగ్గించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే మిగతా జిల్లాల్లో కేవలం ఆదివారం లోనే మాంసాహార అమ్మకాలు జరుగుతాయని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: