విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్.. గురుదేవుడు.. భారతదేశం నుంచి సాహిత్య నోబెల్ అందుకున్న ఒకే ఒక్కడు. నేడు రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి. ఆయన గొప్పదనాన్ని స్మరించుకుందాం. రవీంద్రనాథ్ ఠాగూర్ ను కేవలం కవిగా చూస్తే సంకుచితమే అవుతుంది. ఆయన విశ్వమానవ వాదాన్ని ఖండాంతర వ్యాప్తి చేసిన ఆధునిక భారత రచయిత. రవీంద్రనాథ్ ఠాగూర్ 1861 మే 7 న కోల్‌కతాలో పుట్టాడు.

 

IHG

 

ఆయన కుటుంబ సభ్యులంతా ఆధునిక భావాలు గల ఆదర్శవాదులు. తన తండ్రి నుంచే సంఘ సంస్కరణల ఆవశ్యకతను గ్రహించాడు. రవీంద్రుడు.. గొప్ప రచయిత, గొప్ప విద్యావేత్త. గొప్ప గురువు. భారతదేశాన్ని తన మాతృభూమిగా ఆరాదిస్తూనే ప్రపంచ మానవాళిని ఆదరించే విశ్వనరుడాయన. విశ్వమానవ సౌభ్రాతృత్వం, పరస్పర సహజీవనంల అవసరాన్ని నొక్కి చెబుతూ క్షమాగుణం ప్రవచించే ఆధునిక ప్రవక్త.

 

IHG

 

మనిషిలోని జ్ఞానాన్ని గౌరవించినప్పుడు ఆయన ఎదుగుదలకు ప్రోత్సాహం ఉంటుందని నమ్మే విశ్వనరుడు. అందుకే ఎక్కడ మనస్సు భయాందోళనలకు లోను కాదో.. అంటూ సరికొత్త లోకాన్ని స్వప్నించాడు. ఆకాంక్షించాడు. విశ్వమానవ తత్వాన్ని ఆకలింపు చేసుకునే క్రమంలో సార్వత్రిక వ్యక్తిత్వాన్ని ఆపాదించుకున్నాడు. సత్యం, సత్కార్యాల గొప్పతనాన్ని వెతకడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితులలో కూడా మానవాళిని ఎలా ప్రేమించాలో ఆయన చెప్పాడు.

 

IHG

 

దేశంలోని కుల, మతాల కుమ్ములాటాలను ఎప్పుడో ఊహించిన దార్శినికుడాయన. మతం మనిషిలో విభాజక హేతువు కారాదని వాదించాడు. మనిషిలో మానవత్వాన్ని పెంపొందించేలా ఉండాలని, పక్షపాత వైఖరిని విడనాడి స్వచ్చమైన వ్యక్తిత్వాన్ని ప్రభోదించేలా మతం తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ఠాగూర్ వాదించాడు. కులం, వర్ణం, వర్గం, వారసత్వం, సంస్కృతి, సాంప్రదాయాల వంటి ప్రాపంచిక అంశాలకతీతంగా అందరినీ ఆదరించేదిగా మతముండాలంటాడు.

 

IHG

ఠాగూర్ 1905లో రచించిన అమార్ సోనార్ బంగ్లా గీతం బంగ్లాదేశ్ జాతీయ గీతంగా స్వీకరించబడింది. 1911 లో ఠాగూర్ విరచిత భారతో భాగ్యో బిధాతో నుండి తీసుకున్న జన గణ మన గీతం మనదేశ జాతీయగీతంగా గౌరవం పొందింది. భారతో భాగ్యో బిధాతో సుభాష్ చంద్ర బోస్ ఏర్పరిచిన తాత్కాలిక ప్రభుత్వానికి సైతం జాతీయ గీతంగా ఉండడం విశేషం. శ్రీలంక జాతీయగీతమైన శ్రీలంక మాత కు కూడ ఠాగూర్ గీతాలే స్పూర్తి. 1910 లో ఆయన రచించిన గీతాంజలి భారత దేశ ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాప్తి చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: