క‌రోనా వైర‌స్‌.. ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఈ మ‌హ‌మ్మారి భ‌య‌మే క‌నిపిస్తోంది. ఈ క‌రోనా వైరస్‌ వుహాన్‌లోని ఓ సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్‌ లో కొత్త వైరస్‌ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. వైరస్‌ కారణంగా వుహాన్‌లో ఇద్దరు మృతిచెందడంతో వీరి శాంపిల్స్‌ను లండన్‌కు పంపించి పరిశోధనలు నిర్వహించారు. పరిశోధనల్లో `కరోనావైరస్‌`గా గుర్తించారు. ఇక అప్పుడు ప్రారంభ‌మైన ఈ క‌రోనా వైర‌స్ ఇప్ప‌టికీ.. ప్ర‌జ‌ల‌పై దాడి చేస్తూనే ఉంది. ఈ మ‌హ‌మ్మారి ధాటికి ఎన్నో కుటుంబాలు చిన్నా భిన్నం అవుతున్నాయి.

 

ఇక క‌రోనాని క‌ట్ట‌డి చేసేందుకు ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించాయి. అయిన‌ప్ప‌టికీ క‌రోనా అదుపులోకి రావ‌డం లేదు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌పంచ‌దేశాలు వెనుక‌డుగు వేయడం లేదు. క‌రోనాతో తీవ్రంగా పోరాటం చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రజలు గుంపులు గుంపులుగా ఉండటం వల్ల వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రతి దేశం కూడా సామాజిక దూరం పాటిస్తోంది. సామాజిక దూరం పాటిస్తేనే వైరస్ ను కట్టడి చెయ్యొచ్చు అన్నది ప్రభుత్వం యొక్క ఉద్దేశ్యం. అయితే గాలి ద్వారా వ్యాప్తి చెందే వైరస్ లలో ఒకటైన క‌రోనా గురించి పూర్తిగా అవగాహన రావడం లేదు. 

 

కనీసం 3అడుగుల దూరం ఉండాలని చెప్పి దానిని 6అడుగుల దూరానికి పెంచింది డ‌బ్ల్యూహెచ్ఓ. లేటెస్ట్ గా నిర్వహించిన ఓ స్టడీ ప్రకారం.. కనీస 6 అడుగుల దూరం కూడా సేఫ్ గా ఉంచుతుందనే నమ్మకం లేదు. ఎందుకంటే.. క‌రోనా వైర‌స్ నిజానికి 6 కాదు, 18 అడుగుల దూరం వ‌ర‌కు వ్యాప్తి చెందుతుంద‌ని సైంటిస్టుల తాజా ప‌రిశోధ‌న‌లో తేలింది. గంటలకు 4కిలోమీటర్ల వేగంతో చిన్నపాటి తుమ్ము వచ్చినా..  సెలైవా 5సెకన్లలో 18అడుగుల దూరం వరకూ వ్యాపిస్తుందట. ఆ నీటి తుంపర్లు యువకులనే కాదు, పలు రకాల ఎత్తులో ఉన్న చిన్నారులపైనా ప్రభావం చూపిస్తుంద‌ట‌. అయితే  భిన్న వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్లో ఇది మార‌వ‌చ్చ‌ని వారంటున్నారు. ఏదేమైన‌ప్ప‌టికీ 18 అడుగుల సామాజికదూరం పాటించాలంటూ నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: