దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించిన విషయం అందరికి తెలిసిందే. అయితే లాక్ డౌన్ విధించడం వలన అనేక మంది జీవనోపాధి కోల్పోయారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలు లక్ష్యంగా ముందుకు సాగుతుంది. సామాన్య ప్రజలకు సాయం అందించేందుకు ప్రయత్నిస్తోంది. పోషక ఆహారాన్ని అందించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఇందులో భాగంగానే పైలెట్ ప్రాజెక్ట్‌ను లాంచ్ చేశారు. కేంద్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాన్ పాశ్వాన్ తాజాగా రేషన్ కార్డు కలిగిన వారికి న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తామని ఈ సందర్బంగా తెలిపారు.

 

అయితే కేంద్ర ప్రభుత్వం దీని కోసం రైస్ పోర్టిఫికేషన్ స్కీమ్‌ను అమలులోకి తీసుకువచ్చిందని రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. 15 రాష్ట్రాల్లో ఈ స్కీమ్‌ను పైలెట్ ప్రాజెక్ట్ కింద అమలు చేయడానికి మోదీ సర్కార్ ఆమోదం తెలిపిందన్నారు. ఇప్పటికే ఈ స్కీమ్‌ కింద పైలెట్ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ (ఏపీ), గుజరాత్, మహారాష్ట్రల్లో న్యూట్రిషన్ రైస్ అందించడం ప్రారంభించామని ఈ సందర్బంగా తెలిపారు.

 

ఈ స్కీమ్ ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అతిత్వరలో ప్రారంభం కానుందన్నారు. ఇక ఇతర రాష్ట్రాలను కూడా కేంద్రం ఈ స్కీమ్‌ను అమలు చేయాలని కోరిందన్నారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేంద్ర ప్రభుత్వం దాదాపు 81 కోట్ల మంది రేషన్ కార్డు లబ్దిదారులకు ఈ ప్రయోజనాన్ని అందించనుందన్నారు.

 

రైస్ ఫోర్టిఫికేషన్‌లో భాగంగా రేషన్ కార్డుదారులకు ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బీ12 వంటి పోషకాలు కలిసిన బియ్యాన్ని అందిస్తామన్నారు. దీంతో అనేమియా, సూక్ష్మపోషకాల లేమి వంటి వ్యాధులను నుంచి రక్షణ లభిస్తుందన్నారు. 15 రాష్ట్రాల్లోని ఒక్కో జిల్లాలో రైస్ పోర్టిఫికేషన్‌ను పైలెట్ ప్రాజెక్ట్ కింద అమలు అవుతుందని రామ్ విలాస్ పాశ్వాన్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: