రాజకీయాల్లో ప్రాధాన్యత అనేది వారి వారి యొక్క వ్యవహార శైలిని బట్టి ఉంటుంది. అందరికీ ఒకే తరహా ఆదరణ దక్కాలంటే కుదరని పని. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జేసీ బ్రదర్స్ వ్యవహారం కూడా ఇదే విధంగా ఉంది. కొద్దిరోజుల క్రితమే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా మార్చి అమ్మిన కేసులో వీరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక అంతకుముందే మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ను కూడా ఇదే విధంగా పోలీసులు ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టు చేశారు. కానీ అచ్చెన్న నాయుడు కి లభించినంత ప్రాధాన్యత జేసీ ప్రభాకర రెడ్డి కి  లభించక పోవడమే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. అచ్చెన్నాయుడు అరెస్ట్ వ్యవహారం ఇప్పటికీ పెద్ద చర్చగా మారింది.

IHG

 

 ఆ పార్టీలోని నాయకులు అందరూ ఈ వ్యవహారంపై స్పందించి ప్రభుత్వం కక్ష సాధిస్తుంది అంటూ గొంతు పెంచి మరీ వ్యాఖ్యానిస్తున్నారు. కానీ జెసి ప్రభాకర్ రెడ్డి విషయంలో ఏ ఒక్క నాయకుడు గొంతు ఎత్తడం లేదు. ఆఖరికి జెసి సొంత జిల్లా అనంతపురం లోని టిడిపి కీలక నాయకులు కూడా మొహం చాటేస్తున్నారు. దీనికి కారణం జేసీ బ్రదర్స్ నోటి దురుసుతనం. జిల్లాలోని ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కీలక నాయకులతో జేసీ బ్రదర్స్ కు సన్నిహిత సంబంధాలు లేవు. ప్రతి ఒక్కరితోనూ వివాదం పెట్టుకోవడమే అలవాటుగా మారడంతో, ఇప్పుడు పార్టీలో ఒంటరి వారు అయ్యారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


 ఆఖరికి టిడిపి అధినేత చంద్రబాబు సైతం వీరి వ్యవహారంలో అంతగా జోక్యం చేసుకునేందుకు ఇష్టపడడంలేదు.  ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టు తర్వాత టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనంతపురం వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించడం ఒక్కటే జేసీ బ్రదర్స్ కు కాస్త ఊరట కలిగించే అంశం. మిగతా పార్టీ నాయకులు ఎవరు వారి గురించి కనీసం విచారం వ్యక్తం చేయకపోవడం చూస్తుంటే, జేసీ బ్రదర్స్ పార్టీలో ఒంటరి వారే అయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: