జూలై 2వ తేదీన ఒకసారి చరిత్రలోకి వెళితే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖుల మరణాలు ఎంతో  మంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి  ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు  సంభవించిన మరణాలు జరిగిన ముఖ్య సంఘటనలు ఏంటో తెలుసుకుందాం రండి. 

 

 మల్లెల గురువయ్య జననం : ప్రముఖ కవి మదనపల్లె రచయితల సంఘం స్థాపకుడు అయిన మల్లెల గురవయ్య 1939 జులై రెండవ తేదీన జన్మించారు. ఈయన  రచయితగా ఎంతగానో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఈయన  రచించిన చాలా రచనలు ఎంతగానో ప్రేక్షకాదరణ పొందాయి, దీంతో ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు మల్లెల గురవయ్య. 

 

 కృష్ణ భగవాన్  జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ హాస్య నటుడు రచయిత అయిన కృష్ణభగవాన్ 1965 జూలై 2వ తేదీన జన్మించారు. కృష్ణ భగవాన్ అసలు పేరు మీనా వల్లి పాపారావు చౌదరి, దర్శకుడు వంశీ తన మహర్షి సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు కృష్ణ భగవాన్ ను  పరిచయం చేశారు,. ఎన్నో సినిమాల్లో హాస్య నటుడిగా తనదైన కామెడీ టైమింగ్ తో తెలుగు ప్రేక్షకుల అందరిని మెప్పించాడు కృష్ణభగవాన్. హాస్య నటుడిగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో కూడా నటించారు కృష్ణ భగవాన్. 

 

 జయలలిత జననం : దక్షిణ భారత చలన చిత్ర నటి శృంగార హాస్య పాత్రలను ఎక్కువగా పోషించే నటి  అయిన జయలలిత 1925 జూలై 2వ తేదీన జన్మించారు. జాతీయ పురస్కారాన్ని అందుకున్న గ్రహణం చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. అంతేకాకుండా పలు ధారావాహికలో కూడా నటించింది. తనదైన నటనతో ఎంతగానో గుర్తించి సంపాదించారు. ఎన్నో సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించి తనదైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు జయలలిత. 

 

 గౌతమి జననం  : తెలుగు తమిళ సినిమాకి నటి అయిన  గౌతమి 1968 జూలై 2వ తేదీన జన్మించారు. ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే సినిమాల్లో నటించే అవకాశం రావడంతో సినిమాల్లోకి  ప్రవేశించారు, ఏసుక్రీస్తు జీవితగాథను చిత్రీకరించిన సినిమాతో రంగప్రవేశం చేశారు. అంతేకాకుండా ఓ  సినిమాతో తమిళ సినిమాల్లో ప్రవేశించి రజనీకాంత్ సరసన కూడా నటించారు గౌతమి, ఇక తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో ఎంతో గుర్తింపు సంపాదించారు. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో కూడా నటించి ఎంతగానో గుర్తింపు సంపాదించారు గౌతమి. 


 గడ్డం  రామ్ రెడ్డి మరణం : దూరవిద్య ప్రముఖులు సమాజ శాస్త్ర విజ్ఞానం లో మేటి వ్యక్తి అయినా గడ్డం రాంరెడ్డి 1995 జూలై 2వ తేదీన మరణించారు. ఈయన  సార్వత్రిక విశ్వవిద్యాలయం పితామహుడిగా ఎంతగానో ప్రసిద్ధి గాంచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: