దశల వారీగా చైనా నుంచి వస్తువుల దిగుమతిని తగ్గించుకుంటూ స్వదేశీ ఉత్పత్తులను భారత్ ప్రోత్సహిస్తోంది. చైనా ఆర్థిక మూలాలను దెబ్బ తీసే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. గత కొన్నేళ్ల నుంచి చైనా టీవీలను భారత్ పెద్దఎత్తున కొనుగోలు చేస్తోందనే సంగతి తెలిసిందే. చైనా టీవీలు తక్కువ రేటు ఉండటంతో పాటు విరివిగా లభ్యం కావడంతో మన దేశంలో వీటిని ఎక్కువమంది కొనుగోలు చేశారు.
చైనా వెన్నుపోటు పొడుస్తుండటం, భారత్ వైపుకు తీవ్రవాదులను ఉసిగొల్పుతూ ఉండటంతో చైనా విషయంలో భారత్ మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. మన దేశంలో ఉన్న టీవీలలో 40 శాతం టీవీలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే కావడం గమనార్హం. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న టీవీలపై కేంద్రం తాజాగా ఆంక్షలు విధించింది. 2019లో 781 మిలియన్ డాలర్ల టీవీల కొనుగోలు జరిగితే అందులో 292 మిలియన్ డాలర్ల టీవీలు చైనావే కావడం గమనార్హం.
భారత్ విధిస్తున్న ఆంక్షల వల్ల చైనా భారీగా నష్టపోతూ ఉండటంతో డ్రాగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. గతంలో 59 చైనా యాప్ లను నిషేధించిన భారత ప్రభుత్వం 47 యాప్ లను నిషేధించాలని నిర్ణయం తీసుకుంది. త్వరలో ప్రభుత్వం నిషేధించే 275 యాప్‌ల జాబితాలో పబ్‌జితో సహా మరి కొన్ని యాప్‌లు ఉన్నాయని సమాచారం. టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69ఎ కింద కేంద్రం ఈ యాప్ లను నిషేధించనుందని తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి