స్మార్ట్ ఫోన్లు వచ్చాక.. టెక్నాలజీ పెరిగాక పోకిరీల వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. కొందరు, అమ్మాయిలను, ఆంటీలను టార్గెట్ గా చేసుకుని.. సతాయిస్తునత్నారు కొందరు కుర్రాళ్లు. తమిళనాడులోనూ అలాగే ఓ కుర్రాడు ఓ ఆంటీని టార్గెట్ చేసుకున్నాడు. సదరు ఆంటీ సోషల్ మీడియా కాంటాక్టుల ద్వారా ఎలాగో ఆమె సెల్ నెంబర్ కనిపెట్టాడు. ఇక అప్పటి నుంచి ఆమె ఫోన్‌ కు బూతు బొమ్మలు పంపించడం మొదలుపెట్టాడు.


ఆ ఆంటీ అతడికి ఫోన్‌ చేసి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయవద్దని వార్నింగ్ ఇచ్చింది. కానీ ఆ కుర్రాడు మాత్రం పద్దతి మార్చుకోలేదు. అలాగే బూతు బొమ్మలతో పాటు మరికొన్ని పోర్న్ వీడియోలు కూడా పంపడం మొదలు పెట్టాడు. దీంతో ఆ ఆంటీ రూట్ మార్చేసింది. క్రమంగా అతడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మెస్సేజులు పెట్టేసింది. దీంతో ఆ కుర్రాడు ఎగిరి గంతేశాడు. తన ప్లాన్ వర్కవుట్ అయ్యిందని సంతోషించాడు.


ఓ రోజు ఆ ఆంటీ అతగాడికి ఫోన్ చేసి ఏకంగా ఇంటికి వచ్చేయమని ఆహ్వానించింది. ఇంట్లో ఎవరూ లేరంటూ సంకేతం పంపింది. దాంతో ఆ కుర్రాడు రెచ్చిపోయాడు. తన అదృష్టం పండిందని బాగా ముస్తాబై ఆంటీ ఇంటికి వచ్చాడు. మెల్లగా ఇంట్లోకి ఆహ్వానించి బెడ్ రూమ్‌లోకి తీసుకెళ్లింది.   అప్పటి వరకూ ఊహాల్లో ఊరేగిన ఆ కుర్రాడికి అక్కడ తగిలింది గట్టి షాక్..


అప్పటికే ఈ బెడ్ రూమ్‌లో అతని కోసం వెయిట్ చేస్తున్న ఆ కుటుంబ సభ్యులు.. అతగాడు  బెడ్ రూమ్‌లోకి ఎంట్రీ ఇవ్వగానే తలుపు పెట్టేశారు.. అంతా ఒక్కసారిగా మీద పడి అందిన చోటల్లా కుమ్మేశారు. మరోసారి ఇలాంటి పిచ్చి వేశాలు వేస్తావా అంటూ చెప్పరాని చోట్ల పచ్చడి పచ్చడి చేసేశారు. దీంతో ఆ కుర్రాడికి దిమ్మతిరిగిపోయింది. బాగా దెబ్బలు తిన్న అతగాడు బతుకు జీవుడా ఇంటికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న అతడి పేరెంట్ పోలీస్ కేసు పెట్టడంతో విషయం వెలుగు చూసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: