160కు పైగా పరిశోధకుల బృందాలు కరోనా మహమ్మారి కట్టడి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తాజాగా రష్యా శాస్త్రవేత్తలు కరోనా గురించి ఒక శుభవార్త చెప్పారు. గోరు వెచ్చని లేదా సాధారణ గది ఉష్ణోగ్రత దగ్గర నీళ్లను తాగడం ద్వారా కరోనా నాశనం అవుతుందని తెలిపారు. కరోనా సోకిన వాళ్ల శరీరంలో వైరస్ ను నాశనం చేయడంలో వేడి నీళ్లు కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. రష్యాలోని నోవోసిబిరిక్స్ ప్రాంతంలోని వెక్ట్ర్ స్టేట్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ వైరాలజీ పరిశోధకులు ఈ విషయాలను వెల్లడించారు.
గది ఉష్ణోగ్రత ఉన్న నీరు కరోనా వైరస్ అభివృద్ధిని సులభంగా అడ్డుకోగలదని శాస్త్రవేత్తలు అన్నారు. ఒక రోజు వ్యవధిలో 27 డిగ్రీల సెంటిగ్రేడ్ తో ఉండే నీరు 90 శాతం కరోనా కణాలను చంపగలదని... మూడు రోజుల వ్యవధిలో 99.99 శాతం కణాలు నిర్వీర్యం అవుతాయని శాస్త్రవేత్తలు చెప్పారు. గోరువెచ్చని నీరు నావల్ కరోనా వైరస్ ను చంపడంలో కీలక పాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో ఈ వైరస్ సముద్రపు నీరు, క్లోరినేటెడ్ నీరులో జీవించగలదని తేలింది. అయితే క్లోరినేటెడ్ నీరు, సముద్రపు నీరులో వైరస్ తన సంతతిని పెంచుకోవడం లేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో దేశంలో 69,239 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 30,44,940కు చేరింది. దేశంలో కరోనా రికవరీ రేటు 74.69 శాతంగా ఉండగా 23.43 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి