ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ మేలు జరిగే విధంగా సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దేశంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి లాక్డౌన్ విధించిన నాటినుంచి... ఎంతో మంది ఆర్థికంగా చితికిపోయిన నేపథ్యంలో.. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు నుంచి ఎలాంటి ఈ ఎమ్ ఐ లు వసూలు చేయవద్దు అంటూ మారటోరియం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ఎంతో మందికి మేలు జరిగింది.
కాగా ఈ మారటోరియం ని కేంద్ర ప్రభుత్వం ఆర్బిఐ పొడిగిస్తూ వచ్చింది. ఆర్థికంగా కుదేలైన వారందరూ కాస్త కోలుకునేందుకు అవకాశం కల్పించింది. మార్చి నుంచి ఆగస్టు వరకు బ్యాంకులు ఖాతాదారుల నుంచి ఈఎమ్ఐ వసూలు చేయవద్దు అంటూ మారిటోరియం విధించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఆర్బిఐ విధించిన మారటోరియం ఇక ఈ రోజుతో ముగియనుంది. బ్యాంకుల నుంచి ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో మరోసారి మారటోరియం పొడిగించే అవకాశాలు మాత్రం లేవు. దీంతో రుణాలు తీసుకున్నవారు వడ్డీలతో సహా వచ్చే నెల నుంచి రుణాలు చెల్లించక తప్పదు. ఈ నేపథ్యంలో అందరూ ప్రజలు సిద్ధమైపోతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి