జగన్ సర్కారు ఒక్కొక్కటిగా ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటోంది. ఒక్కో హామీని నెరవేరుస్తూ వస్తోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలు చేయడం ప్రథమ కర్తవ్యంగా జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగానే ఒక్కొక్కటిగా హామీలు నెరవేరుస్తున్నారు. వీటికి తోడు కొత్త పథకాలు కూడా తీసుకొస్తున్నారు. మొత్తానికి సీఎం జగన్ సంక్షేమ రాజ్యానికే ఎక్కువ ప్రాథాన్యం ఇస్తున్నారు.

ఎన్నికలకు ముందు జగన్.. పొదుపు సంఘాల రుణాలు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. అందులో భాంగానే ఇప్పుడు.. పొదుపు సంఘాలకు ఉన్న రుణాలను చెల్లింపు కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా  జరగబోతోంది. ఈమేరకు మంత్రి బొత్స సత్యనారాయణ నిన్న మీడియాకు వివరాలు తెలిపారు.  2019 ఏప్రిల్ 11 నాటికి స్వయం సహాయక బృందాల మహిళలకు ఉన్న 2 7,128 కోట్ల రుణాలు రుణాలను  4 ఏళ్లలో తిరిగి చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారని .. ఇచ్చిన మాట ప్రకారం తొలి ఏడాది గాను 6వేల 792 కోట్ల రూపాయలు  రుణాల చెల్లిస్తున్నట్లు తెలిపారు.

శుక్రవారం ఉదయం 11 గంటలకు  తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి సీఎం  లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తారన్నారు.  90 లక్షల స్వయం సహాయక మహిళలకు లబ్ది చేకూరుతుందన్నారు. ప్రతి ఇంటికి కార్యక్రమం చేర్చేలా వారోత్సవం నిర్వహిస్తున్నామన్న మంత్రి అందరూ పాల్గొనాలని కోరారు. ఇదే సమయంలో మంత్రి బొత్స మిగిలిన అంశాలపైనా మీడియాతో మాట్లాడారు.


అంతర్వేదిలో రథం దగ్దం ఘటనపై వెంటనే ప్రభుత్వం చిత్త శుద్దితో చర్యలు తీసుకుందని ... ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటుందన్నారు. కొందరు అల్లరి మూకలు విధ్వంసం సృష్టించే ప్రయత్నించాయని మంత్రి ఆరోపించారు. మంత్రి వెల్లంపల్లిపై దాడికి యత్నించారని.. చర్చిపై రాళ్లు విసిరారని అన్నారు. భగవంతున్ని నమ్మేవారెవరైనా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారా అని ప్రశ్నించారు. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ ఎందుకని బొత్స ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: