ఇద్దరూ ఒకే లింగం కలిగిన వారిని స్వలింగం అని అంటారు. అయితే గతంలో వీరిద్దరూ కలిసి పెళ్లి చేసుకోవచ్చు అనే అంశం పై కేంద్రం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. స్వలింగ జంటల మధ్య వివాహాన్ని భారతీయ సంస్కృతి, చట్టాలు, న్యాయవ్యవస్థ, సమాజం, మన విలువలు గుర్తించలేవని, ఇలాంటి వివాహాలను అనుమతించలేమని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది. అయితే స్వలింగ వివాహాలపై కేంద్ర ప్రభుత్వం విస్తృత పరిధిలో ఆలోచించాలని ఢిల్లీ హైకోర్టు సూచించింది. ఈ మేరకు విచారణను వాయిదా వేసింది.


ప్రపంచంలో చాలా మార్పులు జరుగుతున్నాయి. అలాంటిది వివాహా వ్యవస్థలో కూడా మార్పులు కలిగితే తప్పు లేదంటూ కొన్ని విమర్శలు ఎదురయ్యాయి. ఎల్‌జీబీటీక్యూ సభ్యులు, పలువురు సామాజిక కార్యకర్తలు వేసిన పిటిషన్ ‌పై ఇద్దరు సభ్యులు గల ధర్మాసనం తన అభిప్రాయం తెలిపింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ డీఎన్‌ పటేల్‌, జస్టిస్‌ ప్రతీక్‌ జలాన్‌ల ఎదుట సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కేంద్ర ప్రభుత్వ వాదనను వినిపించారు.


ఇద్దరు ఒకే లింగ వివక్ష ఉన్న వారి వివాహానికి సమాజం ఒప్పుకోదు..ఖండిస్తుంది అంటూ మెహతా ఎదురు ప్రశ్నలు వేశారు.అలాంటి వివాహాలను భారత దేశం అనుమతిస్తే వివాహా వ్యవస్థ పూర్తిగా దెబ్బ తింటుందని, వివాహా వ్యవస్థ పై ఎవరికీ నమ్మకం లేకుండా పోతోందని వాద ప్రతి వాదనలు వినిపించారు.ఇక స్వలింగ వివాహాలకు రిజిస్టర్ చేసుకున్న వారికి ఎక్కడ అడ్డు చెప్పలేదు అంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది అన్నారు. ఈ విషయం పై మరోసారి విచారణను జరిపించాలని కోర్టు ఆదేశించింది. అక్టోబర్ 21 కి వాయిదా వేసింది. స్వలింగ వివాహాలను అనుమతి ఇస్తే ఇంక స్త్రీ పురుషుల వివాహా వ్యవస్థ రద్దు అవుతుందని కొందరు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. తుది తీర్పు పై ఆధారపడి ఉందని వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: