ఆంధ్ర ప్రదేశ్ ను వదలని కరోనా.. తగ్గుముఖం పట్టింది అనుకునే లోపు మళ్లీ ఆందోళనకరంగా మారుతుంది.
గడిచిన మూడు రోజులు పాజిటివ్ కేసుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. మరణాల సంఖ్య కూడా పూర్తిగా తగ్గిపోయింది. అలాగే కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కేవలం ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రమే ఆందోళనకరంగా ఉంది. కానీ ఇప్పుడు మళ్లీ కరోనా ఉగ్ర రూపం దాల్చుతుంది.



ఈరోజు ఏపీలో కొత్తగా 8,250 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించారు. శుక్రవారం వరకు కరోనా కేసులు, మరణాలు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. ఈరోజు నిర్వహించిన టెస్టుల లో 8 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. దీంతో అధికారులు, ప్రజలు అప్రమత్తమయ్యారు. ఈరోజు నమోదు అయిన కేసులతో కలిపి మొత్తం ఏపీలో 6,17,776కు కరోనా కేసులు చేరాయి. గడిచిన 24 గంటల్లో కరోనా తో 58 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనా తో 5,302 మంది మృతి చెందారు.



 ప్రస్తుతం ఏపీలో 81,763 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 5,30,0711 మంది ఇంటికి వెళ్లారు. 24 గంటల్లో 74,600 ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మార్చి 22 నుంచి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షలకు పై కరోనా టెస్టుల చేశారు. తాజాగా కృష్ణాలో ఏడుగురు, చిత్తూరు లో తొమ్మిది మంది, కడప , గుంటూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదుగురు చనిపోయారు. విశాఖ , ప్రకాశం జిల్లాల్లో నలుగురు, కర్నూల్, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాలో ముగ్గురు చనిపోయినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించారు. కరోనా ప్రభావం మళ్లీ పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే వాలంటీర్ కు సమాచారం అందించాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: