జగన్ దెబ్బకు చాలామంది టీడీపీ నేతలు సైలెంట్ అయిపోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రాయలసీమలోని టీడీపీ నేతలు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో చాలా వెనుకబడి ఉన్నారు. అందులోనూ వైసీపీకి కంచుకోటగా భావించే కర్నూలు జిల్లాలో టీడీపీ నేతలు పెద్దగా యాక్టివ్‌గా ఉన్నట్లు కనిపించడం లేదు. కానీ ఈ జిల్లాలోని  మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ మాత్రం ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు పెడుతూ, జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.


తాజాగా కూడా మూడు రాజధానులని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూల్లో హైకోర్టు పెట్టడం అనేది ప్రభుత్వం చేతిలో లేదని, రాయలసీమకు హైకోర్ట్ వచ్చినంత మాత్రాన అక్కడి ప్రాంత యువతకు ఉద్యోగాలు వస్తాయా? అని, రైతుల జీవితాలు బాగుపడతాయా అని  ప్రశ్నించారు. ఇంకా ఇప్పటికే అభివృద్ధి చెంది ఉన్న విశాఖపై ప్రభుత్వ పెద్దల కన్ను ఎందుకు పడిందో తెలుసని, అమరావతి రైతులకు అండగా ఉండాలని మాట్లాడారు.

అయితే బ్రిటీషు వారి మాదిరిగానే వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో విభజించు - పాలించు విధానాన్ని అమలు చేస్తోందని ఆరోపించారు. ఇక అఖిల చేసిన విమర్శలు లాజిక్‌గానే  ఉన్నాయని టీడీపీకి సపోర్ట్ చేసే విశ్లేషుకులు అభిప్రాయపడుతున్నారు. విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకెళ్లే విషయాన్ని పక్కనబెడితే, కర్నూలుకు హైకోర్టు తీసుకురావడం రాష్ట్రం చేతిలో లేదని, అదంతా రాజ్యాంగం ప్రకారం జరగాలని, ఇప్పటికే ఆ ప్రక్రియ జరిగిపోయిందని, అమరావతిలో హైకోర్టు ఏర్పాటు అయిందని చెబుతున్నారు.

దీన్ని కదపడం సులువు కాదని, అలాగే కర్నూలుకు హైకోర్టు వచ్చినా పెద్ద ఉపయోగం ఉండదని అంటున్నారు. కేవలం ప్రాంతాల వారీగా విడదీసి వైసీపీ ప్రభుత్వం రాజకీయం చేస్తూ లబ్దిపొందాలని చూస్తుందని, అది ప్రజలకు అర్ధమైన రోజు వైసీపీకే చాలా ఇబ్బందని చెబుతున్నారు. ఇది కేవలం టీడీపీని దెబ్బకొట్టడంలో భాగంగా వైసీపీ ఆడుతున్న రాజకీయ క్రీడా అని, ఈ రాజకీయ క్రీడ ఎక్కువ రోజులు నడవదని మాట్లాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: