జగన్ అటు పార్టీలో కానీ ఇటు ప్రభుత్వంలో కానీ అత్యంత శక్తిమంతుడు, జగన్ తరువాతే ఎవరైనా  అని చెప్పాలి. ఇక వన్ టూ టెన్ జగన్ ఉంటే ఆ తరువాత అయినా ఎవరో ఒకరు ఉండాలిగా. అలా జగన్ కి విపక్ష కాలం నాటి నుంచి నేటివరకూ కుడి భుజం గా ఉన్న నాయకుడు ఎంపీ విజయసాయిరెడ్డి అని చెప్పుకోవాలి. ఆయన జగన్ తో పాటే పదహారు నెలల జైలు జీవితాన్ని కూడా అనుభవించిన నేత. పైగా వైఎస్ కుటుంబంతో  మూడు తరాలా అనుబంధం.  దీంతో జగన్ కి అతి సన్నిహితంగా మెలిగే నాయకులలో మొదటి వరసలో ఆయనే ఉంటారు.

ఆ విధంగా వైసీపీలో ఆయన పలుకుబడి కూడా బాగా పెరిగింది. ఆయన్ని చూసిన వారంతా నంబర్ టూ గానే పేర్కొంటారు. మరి ఆయన హవాకు ఈ మధ్యనే బ్రేకులు పడుతున్నాయని అంటున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సాయిరెడ్డిని ఉత్తరాంధ్రా వైసీపీ  ఇంచార్జిగా జగన్ చేశారు. ఇక పార్టీ ప్రధాన కార్యాలయం బాధ్యతలతో పాటు,  కీలకమైన అన్ని విషయాలనూ చూసే బాధ్యత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డికి ఇచ్చారు.

దాంతో సజ్జల హవా ఒక్కసారిగా పార్టీలో పెరిగిపోయిందని అంటున్నారు. అటు ప్రభుత్వ సలహాదారుగా కూడా ఆయన చక్రం తిప్పుతున్నారని కూడా టాక్ నడుస్తోంది. ఒక విధంగా జగన్ తరువాత ఆయనేనని అంటున్నారు. ఎంతలా అంటే సీఎంఓ కార్యాలయానికి ఏ ఒక్కవైసిపీ  ప్రజా ప్రతినిధి వెళ్ళినా కూడా సజ్జలను కలవమనేటంతగా. దాంతో సజ్జలను షాడో చీఫ్ మినిస్టర్ అని కూడా అంటున్నారుట. మరి ఇంతలా సజ్జల జగన్ సర్కార్ లోనూ పార్టీలోనూ కూడా తన పలుకుబడిని పెంచుకుంటూంటే
విజయసాయిరెడ్డి మాత్రం దూరంగానే ఉంటున్నారు అని వైసీపీలో వినిపిస్తున్న మాట.   జగన్ కుడి భుజం మారిందా. మార్చుకున్నారా అన్నది కూడా తేలాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: