తెలుగు వారు జరుపుకునే పండుగల్లో  అతిపెద్ద పండగ దసరా. ఈ దసరాకి సంబంధించి అనేక కధలు ఉన్నాయి. వాటిలో నిజమైనది ఏది...? అసలు ఆ కధలు ఏమిటి...? ఇప్పుడే వీటి గురించి తెలుసుకోండి.  మనం ఈ కధని వినే ఉంటాం. అదేమిటంటే..? మహా భారతం ప్రకారం పాండవులు  అరణ్యవాసాన్ని  పూర్తి చేసుకుని వస్తారు.  ఈ సందర్భంగా విజయదశమిని నిర్వహించుకుంటాం అని చెబుతుంటారు పెద్దలు. అలానే  పాండవులు అజ్ఞాత వాసానికి బయల్దేరే ముందు వారి ఆయుధాలను ఒక శమీ వృక్షంపై పెట్టి వెళ్లారు. విజయదశమి రోజు శమీ వృక్షం పై  పెట్టిన ఆయుధాలను కిందకు దింపి పూజలు చేశారు.  అలా మనం విజయదశమిని జరుపుకుంటాం. అందుకే విజయదశమి రోజు జమ్మి చెట్టుకు పూజలు చేసి ఆకుల్ని పెద్దలకు సమర్పించి వారితో ఆశీస్సులు తీసుకుంటాం.  

ఇది ఇలా ఉండగా అమ్మవారిని ఎందుకు పూజిస్తాం అంటే...?  బ్రహ్మదేవుని వరంతో మహిషాసురుడు చెలరేగిపోయాడు. దేవలోకంపై దండయాత్ర చేసి ఇంద్రుడిని ఓడించాడు. మహిషాసురుడి పై త్రిముర్తుల్లో క్రోదాగ్ని రగిలింది. ఆ తేజస్సు ఓ స్త్రీరూపమై జన్మించింది. అప్పుడు గళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును విష్ణువు చక్రమును ఇంద్రుడు వజ్రాయుధమును వరుణ దేవుడు పాశము బ్రహ్మ దేవుడు అక్షమాల కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. మహిషాసురునితో తలపడింది ఆమె. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహమూ శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము సింహరూపము మానవరూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి మహిషిరూపములో దేవి చేతిలో హతుడైనాడు.

ఇందు మేరకు మనం అమ్మ వారిని ఈ నవరాత్రులు పూజిస్తాము అని అంటారు. నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. అమ్మవారిని నిష్టగా పూజిస్తాం. ఇక ఎనిమిదో రోజున దుర్గాష్టమిని కూడా ఘనంగా జరుపుతారు.  అలానే రామాయణం ప్రకారం  శ్రీ రాముడు రావణుడిపై విజయం సాధించిన రోజును గర్తు చేసుకుంటూ కూడా కొన్ని ప్రాంతాల్లో విజయదశమి నిర్వహించుకుంటారు. ఇలా చెడు పై మంచి విజయం సాధించినందున ఈ పండుగ చేసుకోవడం తరతరాల నుండి మనం చూస్తున్నాం.


మరింత సమాచారం తెలుసుకోండి: