బీహార్ ఎన్నికలు సమీపిస్తున్నవేళ రాజకీయం రణరంగంగా మారుతోంది. ఈ నేపథ్యంలో prasad YADAV' target='_blank' title='లాలూ ప్రసాద్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>లాలూ ప్రసాద్ యాదవ్ గురించి నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని లేపాయి. కొడుకు కావాలనే నెపంతో 8 నుంచి 9 మంది పిల్లను కన్నారంటూ లాలా ప్రసాద్ యాదవ్, రబ్రీదేవిలను ఉద్దేశించి నితీశ్ కుమార్ విమర్శించిన సంగతి అందరికీ తెలిసినదే. కాగా.. లాలూ దంపతులకు మొత్తం 9 మంది సంతానం. వరుసగా ఏడుగురు కూతుళ్ల తర్వాత తేజశ్వి, తేజ్ ప్రతాప్ యాదవ్ జన్మించారు.

దీన్ని ఉద్దేశించి నితీశ్ కుమార్ విమర్శించారు. కూతుళ్లపై లాలూ దంపతులకు అస్సలు అభిమానం లేదని.. కొడుకు కోసం పిల్లలను కంటూనే పోయారని అన్నారు. వీళ్ళలాగే వీరు తయారు చేయాలనుకుంటున్న బీహార్ కూడా ఇదే మాదిరి ఉంటుందని విమర్శించారు. ఇక ఈ వ్యాఖ్యలపై తేజశ్వి యాదవ్ నితీశ్ కుమార్ కి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.

నితీశ్ కుమార్ చాలా చక్కగా మాట్లాడారని వ్యంగ్యంగా అంటూనే.. తన తల్లి మనోభావాలను, అలాగే మహిళల మనోభావాలను నితీశ్ దెబ్బతీశారని విమర్శించారు. అలాగే తన వ్యాఖ్యలతో దేశ ప్రధాని అయినటువంటి మోదీని కూడా నితీశ్ ఇండెరెక్ట్ గా విమర్శించారని చెప్పారు. మోదీకి కూడా మాకు మల్లే 9 మంది సోదర సోదరీమణులు ఉన్నారని చురకలంటించారు. నేటి సమాజానికి అవసరమైన నిత్యావసర ధరలు, అవినీతి, నిరుద్యోగం వంటి సమస్యల గురించి నితీశ్ అస్సలు మాట్లాడరని.. ఇలాంటి చవుకబారు విషయాల గురించి మాత్రమే మాట్లాడతారని మండిపడ్డారు.

ఇక ఈ వయసులో నితీష్ మరేం చేయగలరు.. మానసికంగా, శారీరకంగా ఆయన బాగా అలిసిపోయారని... అందుకే నోటికి ఏది అనిపిస్తే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. బీహార్ ప్రజలకు బాగా తెలుసు. ఎవరిని ఎన్నుకోవాలో.. ఎవరిని ఎన్నుకోకూడదో అని అన్నారు. ఈసారి ప్రజలు పూర్తిగా అభివృద్ది, ఉపాధి కల్పనకే ఓటు వేస్తారని తేజస్వి ఒకింత ధీమా వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: